బాలయ్య 102 టైటిల్ విషయంలో అయోమయం, ఏది నిజం?
నందమూరి బాలకృష్ణ 102వ సినిమాకు జయ సింహ అనే టైటిల్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాక పోవడంతో రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
కొన్ని రోజుల క్రితం ఈ చిత్రానికి 'జయ సింహ' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. తర్వాత అది కాదు.... 'ఎన్‌బికె కర్ణ' అనేది ఫైనల్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి అయోమయం
తాజాగా మరోసారి అభిమానులను అయోమయంలోకి నెట్టేస్తూ.... ఈ సినిమాకు టైటిల్ ‘కర్ణ' కాదు, ‘జయ సింహ' ఫైనల్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బాలకృష్ణ సినిమాలకు సింహ అనేది బాగా కలిసి వస్తుండటంతో ఈ టైటిల్ ఫైనల్ చేసే అవకాశం ఉందట. అయితే దర్శక నిర్మాతల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ముఖ్య నటీనటులు
బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటించనుండగా మరో నాయికగా నటాషా దోషీ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సంక్రాంతి రిలీజ్
ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలోకిగా షూటింగ్ పూర్తి చేసి అదే నెలలో ఆడియో రిలీజ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం.

తెర వెనక
ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!


Click it and Unblock the Notifications











