బాలకృష్ణ బాబాయ్ చెప్పిన సలహా..తారకరత్న
బాబాయ్ బాలకృష్ణ ఓ మాట ఎప్పుడూ చెబుతుండేవారు...'విజయానికి పొంగిపోకు. పరాజయానికి కుంగిపోకు. జీవితమనే రహదారిలో ఎత్తులూ పల్లాలూ మామూలే'. బాబాయ్ మాటలే వేదవాక్కు. 'అమరావతి'లో నా పాత్రకు వస్తున్న స్పందన చూస్తోంటే నా ప్రయాణం ఇప్పుడు కొత్త దారిలో వెళ్తున్నట్టు అనిపిస్తోంది..అంటూ నందమూరి తారకరత్న తాజాగా చేసిన అమరావతి చిత్రం ప్రమేషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఒకేసారి తొమ్మిది సినిమాలతో అరంగేట్రం చేశారు. ఆ జోరు కొనసాగించలేకపోవడానికి కారణం ఏమిటి అన్నదానికి ఆయన పై విధంగా స్పందించారు. అలాగే కథల విషయంలో కొన్ని తప్పులు జరిగిపోయాయి. అయినా వాటిని గుర్తుపెట్టుకోదలుచుకోలేదు అంటూ గతాన్ని త్రవ్వుకోవటం ఇష్టం లేదంటూ నిక్కిచ్చిగా చెప్పారు. అలాగే అమరావతి చిత్రంలో నెగటివ్ రోల్ ఒప్పుకోవటానికి కారణం వివరిస్తూ..దర్శకుడు రవిబాబు చెప్పిన కథ...అందులో నా పాత్ర నచ్చాయి. వెంటనే ఒప్పుకొన్నాను. చేసే పని మీద స్పష్టత ఉన్న దర్శకుడాయన. ఎప్పుడూ విభిన్న కోణంలో ఆలోచిస్తుంటారు. అందుకే కాదనలేకపోయాను అన్నారు. అల్లరి రవిబాబు దర్శకత్వంలో విడుదలైన అమరావతి చిత్రం బిలో యావరేజి టాక్ తెచ్చుకుంది. రవిబాబు అభిమానులను మాత్రమే ఈ చిత్రం అలరిస్తోంది.


Click it and Unblock the Notifications











