twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోడెల భౌతికకాయానికి బాలకృష్ణ నివాళి.. ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ భావోద్వేగం

    |

    నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు కోడెల శివ ప్రసాద్ (72) మరణం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆయన సోమవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలియడంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు నిర్ఘాంత పోయాయి. ఈ నేపథ్యంలో కోడెల మృతి పట్ల టీడీపీ పార్టీ వర్గాలు, ఇతర రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నారు.

    పోస్టుమార్టం నివేదిక ప్రకారం

    పోస్టుమార్టం నివేదిక ప్రకారం

    కోడెల మృతదేశానికి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యులు.. ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించారు. ఆ నివేదికలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం ద్వారానే మరణించారని వెల్లడించడం జరిగింది. మెడ భాగంలో 8 అంగుళాల తాడు గాట్లు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. సూసైడ్ చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని నివేదకలో పేర్కొన్నారు. వీడియో చిత్రీకరణ మధ్య పోస్టుమార్టం జరిగింది.

    టీడీపీతో అనుబంధం.. బాలకృష్ణ స్పందన

    టీడీపీతో అనుబంధం.. బాలకృష్ణ స్పందన

    టీడీపీ పార్టీతో కోడెల అనుబంధం ఈ నాటిది కాదు. ఎన్టీఆర్ కాలం నుంచి తన తుది శ్వాస విడిచే వరకు టీడీపీ పార్టీ వెన్నంటే ఉన్నారు కోడెల. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీతో కోడెలకు మంచి అనుబంధం ఉండేది. ఈ నేపథ్యంలో పార్టీ వర్గాలు, నందమూరి ఫ్యామిలీ సభ్యులు కోడెల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ తన సంతాపం తెలియజేస్తూ కొన్ని జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

     ఈ రోజు ఓ దుర్దినం అంటూ బాలయ్య బాబు

    ఈ రోజు ఓ దుర్దినం అంటూ బాలయ్య బాబు

    సోమవారం రాత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనకు వచ్చి కోడెల మృత దేహానికి ఘననివాళి సమర్పించారు సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కోడెల మరణం పొందిన ఈ రోజు ఓ దుర్దినం అని పేర్కొంటూ ఆయన మరణించారనే వార్త జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు.

    అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆవేదన

    అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆవేదన

    బసవతారకం ఆస్పత్రి ప్రారంభించినపుడు ఆయనే ఫౌండర్ ఛైర్మెన్ అని గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు బాలకృష్ణ. అప్పట్లో అమ్మగారి జ్ఞాపకార్థం నాన్నగారు ఆస్పత్రి నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నపుడు కోడెల ముందడుగు వేసి మంచి సహకారం అందించారని బాలకృష్ణ తెలిపారు. రాజకీయ నాయకుడిగానే గాక వైద్యుడిగా కూడా ఎన్నో సేవలందించిన కోడెలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని బాలకృష్ణ అన్నారు.

    బాలకృష్ణ సినీ జర్నీ

    బాలకృష్ణ సినీ జర్నీ

    ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్‌తో తన తండ్రి జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుంచిన ఆయన, ప్రస్తుతం తన 105వ సినిమా చేస్తున్నారు. కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    Kodela Siva Prasad passed away yesterday afternoon. On His death Nandamuri Balakrishna condolence at ntr trust bhavan. He remebers relationship with Kodela Siva Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X