బాలయ్య 'జై సింహా'కు రజనీకాంత్ సినిమాతో లింకు?: కథ లీక్!.. సెంటిమెంట్ దంచేశారట..
Recommended Video

కొత్త సినిమా మొదలైందంటే చాలు.. తెరపై బొమ్మ పడేదాకా దాని చుట్టూ కావాల్సినన్ని గాసిప్స్ షికారు చేస్తుంటాయి. పబ్లిసిటీ పరంగా ఈ గాసిప్స్ సినిమాలకు మేలు చేసేవే అయినప్పటికీ.. శ్రుతిమించితే మాత్రం పెద్ద డ్యామేజ్ తప్పదు.
తాజాగా నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న 102వ చిత్రంపై కూడా ఓ కొత్త గాసిప్ పుట్టుకొచ్చింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ఓ సినిమా ఛాయలు కనిపిస్తాయన్న ఊహాగానాలు ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఏంటా సినిమా?:
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 1995లొ వచ్చిన 'ముత్తు' సినిమా కథనే 'జై సింహా' సినిమాకు స్ఫూర్తిగా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ముత్తు సినిమాలో లాగే.. జై సింహాలోను బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారట. కాగా, ముత్తు సినిమా దర్శకుడు కూడా కె.ఎస్.రవికుమారే కావడం గమనార్హం.

అభిమానుల్లో టెన్షన్:
జైసింహాలో ముత్తు సినిమా ఛాయలు కనిపిస్తాయన్న ఊహాగానాలతో నందమూరి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ సినిమాపై గతంలోనూ ఇలాంటి ఊహాగానాలు చాలానే వచ్చాయి.
బాలయ్య భగ్న ప్రేమికుడి పాత్రలో కనిపించబోతున్నారని, తాను ప్రేమించిన నయనతారకు కిక్ శ్యామ్ తో పెళ్లవుతుందని.. ఇలా జై సింహా కథ గురించి చాలానే ఊహాగానాలు వినిపించాయి.

ఫస్టాఫ్‌కే పరిమితం?..:
బాలయ్య జైసింహా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. జైసింహా ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్ తో కుమ్మేసినప్పటికీ.. సినిమాలో మాత్రం ఫస్టాఫ్.. క్లైమాక్స్‌కు మాత్రమే వీటిని పరిమితం చేశారట.

సెకండాఫ్‌పై లీకులు!..:
ఇక సెకండాఫ్ మొత్తం సెంటిమెంట్ చుట్టే కథ నడుస్తుందన్న లీకులు వస్తున్నాయి. ప్రధానంగా బాలయ్య-నయనతార ఎపిసోడ్స్ మొత్తం సెంటిమెంట్ రంగరించుకునే ఉంటాయట. సెకండాఫ్ మొదలైన దగ్గరి నుంచి క్లైమాక్స్ వరకు సెంటిమెంట్ చుట్టే కథ నడుస్తుందని ఫిలింనగర్ వర్గాల్లో గుసగసలు మొదలయ్యాయి.

డోసు ఎక్కువైతే..
సంక్రాంతి అనగానే ప్రేక్షకులు కుటుంబ కథా చిత్రాలను కోరుకుంటారు కాబట్టి.. పండుగ బరిలో నిలిచిన జైసింహాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎక్కువగా జోడించారట. అయితే ఒక పరిధి వరకు ఓకె గానీ, సెంటిమెంట్ డోసు ఎక్కువైతే మొదటికే మోసం వస్తుందనేవారు లేకపోలేదు.

ట్రైలర్ టాక్:
బాలయ్య గత సినిమాలైన సింహా, లెజెండ్ తరహాలోనే 'జైసింహా'లోనూ యాక్షన్ పాళ్లు గట్టిగానే ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. అభిమానులు బాలయ్యను ఎలా చూడాలనుకుంటున్నారో.. అలానే ఆయన పాత్ర ఉంటుందని కె.ఎస్.రవికుమార్ కూడా చెప్పారు. దీన్నిబట్టి మరోసారి తెరపై బాలయ్య పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారన్నది మాత్రం అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











