'జైసింహా' ట్విట్టర్ రివ్యూ: బాలయ్య 'బొమ్మ' గర్జించిందా?..
Recommended Video

సంక్రాంతి బరిలో ఆల్రెడీ ఓ సినిమా బోల్తా కొట్టేసింది. ఇక నేడు నందమూరి నటసింహం బాలయ్య నటించిన 'జైసింహా' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ 'షో'లు పడ్డాయి. ఏపీలోనూ అర్థరాత్రి నుంచే ప్రీమియర్లు నడుస్తున్నాయి. ప్రీమియర్ 'షో'లు వీక్షించిన ప్రేక్షకుడు సినిమా గురించి ఏం చెబుతున్నాడు.. సంక్రాంతి రేసులో బాలయ్య హిట్టా.. ఫట్టా?.., ట్విట్టర్ రివ్యూ ద్వారా చూద్దాం..
ఆ సీన్ హైలైట్:
ఫస్టాఫ్ సూపర్బ్. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. ఫస్టాఫ్ లో వచ్చే అమ్మకుట్టి సాంగ్, బ్రాహ్మణుల మీద చిత్రీకరించిన ఓ సీన్ హైలైట్ గా నిలుస్తాయి.
గుడ్ ఎంటర్టైనర్:
ఫస్టాఫ్ చాలా బాగుంది. కామెడీ, యాక్షన్, రొమాన్స్ అన్నీ కలిగలిపిన ఎంటర్టైనర్.
హిట్ టాక్.
ఫస్ట్ డే ఫస్ట్ షో.. హిట్ టాక్. అజ్ఞాతవాసి కన్నా 10టైమ్స్ బైటర్.
రొటీన్ స్టఫ్:
రొటీన్ స్టఫ్. జైసింహా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
సెకండాఫ్ బాగుంది:
ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ చాలా చాలా బాగుంది. కథ చాలా బాగుంది. హిట్ మూవీ.
ఫస్టాఫ్ రిపోర్ట్:
ఔట్&ఔట్ మాస్ సినిమా. బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











