twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. లేదనుకున్న ఆ సినిమా ముహూర్తానికి రెడీ అయింది

    |

    టాలీవుడ్‌లో ఎంతమంది హీరోలున్నా అందరిలో కెల్లా నందమూరి బాలకృష్ణ క్రేజ్ వేరు. బాలయ్య బాబు సినిమా అంటే చాలు క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా థియేటర్ల బాట పడతారు. అయితే కుర్ర హీరోలు వచ్చాక కూడా బాలయ్య బాబు క్రేజ్ ఏ మాత్రం తగ్గక పోవడం విశేషం. యంగ్ హీరోలతో పోటీ పడుతూ బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తున్నాడు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో సెంచరీ కొట్టేసిన ఈ వెటరన్ హీరో ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో బాలయ్య బాబు క్రియాశీలంగా పాల్గొనడం కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారాయన.

    ఎన్నికల హడావిడి అయిపోవడంతో ఇక కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 105 వ సినిమాను లైన్‌లో పెడదామని భావించారు బాలయ్య. కానీ టీడీపీ ఓటమి కారణంగా ఆ సినిమా డైలమాలో పడింది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ యువ నాయకుడిని విలన్‌గా చూపించే ప్రయత్నం సాగుతోందని గుసగుసలు వినిపించాయి. ఈ లోగా ఎన్నికల రిజల్ట్ రావడం టీడీపీ వుడటం జరిగాయి. దీంతో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని వార్తలు వినిపించాయి. పొలిటికల్ డ్రామా కావడంతో ప్రస్తుతం జనాల్లో ఉన్న క్రేజ్‌కి అనుగుణంగా పాత్రల్ని మార్చుతూ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేశారట.

    Nandamuri Balakrishnas new movie will starts on june 12

    దీంతో ఒక దశలో బాలయ్య బాబు, కె.ఎస్.రవికుమార్ కాంబోలో రానున్న మూవీ క్యాన్సిల్ అయిందనే వార్తలకు చెక్ పెడుతూ ఈ సినిమా ముహూర్తం ఫిక్స్ చేసిందట చిత్రయూనిట్. బడా నిర్మాత సి కళ్యాణ్ నిర్మించనున్న ఈ సినిమాను బాలయ్య అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ ఈనెల 12న ప్రారంభించేందుకు అంతా రెడీ చేస్తున్నారనేది లేటెస్ట్ సమాచారం. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించనుందని కూడా అన్నారు. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో!

    English summary
    Nandamuri Balakrishna commits with director K. S. Ravikumar for his new movie. As per latest news this film is starts on June 12th. And in this movie Blakrishna played a intresting role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X