Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలకృష్ణ ఆన్ ఫైర్.. పొగరు చూపించమంటావా అంటూ ఉతికేశాడు..ఇది దెబ్బతిన్న సింహంరా!
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా 'రూలర్'. ఈ చిత్రానికి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
వేగంగా రూలర్ ప్రమోషన్స్.. ట్రైలర్ రిలీజ్
బాలకృష్ణ కెరీర్లో 105 వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫెరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ లుక్స్ విడుదల చేశారు మేకర్స్. దీంతో నందమూరి అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ అంచనాలను రెట్టింపు చేసేలా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.
రెచ్చిపోయిన బాలయ్యబాబు
2 నిమిషాల 17 సెకనుల నిడివితో విడుదలైన రూలర్ ట్రైలర్లో బాలయ్య బాబు రెచ్చిపోయారు. ముఖ్యంగా ఆయనపైనే ఫోకస్ చేస్తూ సన్నివేశాలను కట్ చేశారు. రైతు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతోంది. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఔరా అనిపించాయి.
అడ్డుచ్చినోడిని నరకడం, కాల్చడం
రైతు నేపథ్యం, రాజకీయాలతో పాటు యాక్షన్ డ్రామాను కూడా మిక్స్ చేస్తూ రూలర్ సినిమా ఉండబోతోందని స్పష్టమయింది. మాస్ పోలీస్ ఆఫీసర్‌గా పిచ్చెక్కించాడు బాలకృష్ణ. భారీ డైలాగులతో పాటు అడ్డుచ్చినోడిని నరకడం, కాల్చడం అన్నీ ఈ ట్రైలర్ లో హైలైట్ సన్నివేశాలుగా నిలుస్తున్నాయి. మొత్తంగా చూస్తే మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూలర్ సినిమా తెరకెక్కించారని అర్థమవుతోంది.
ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తేలిగ్గా చావదు
ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తేలిగ్గా చావదు.. వెంటాడి వేటాడి చంపుద్ది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ అవుతోంది. బాలయ్య రచ్చ చూస్తుంటే ఈ సారి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం అని తెలుస్తోంది. గతంలో కెఎస్ రవికుమార్- బాలకృష్ణ కాంబోలో వచ్చిన జై సింహా సూపర్ హిట్ కావడం కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Recommended Video
రూలర్ రొమాన్స్ డోస్
ఇక ఈ చిత్రంలో రొమాంటిక్ డోస్ కూడా పుష్కలంగా ఉందని తెలుస్తోంది. సోనాల్ చౌహాన్, వేదిక ఈ రూలర్ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోనాల్ బికినీ అందాలు సినిమాకు బోనస్ కానున్నాయని టాక్. ఇద్దరు హీరోయిన్లతో బాలకృష్ణ చేసిన రొమాన్స్ బాలయ్య అభిమానులకు స్పెషల్ కిక్ ఇవ్వనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.