సైలెంట్ గా 'సింహా' ఆడియో విడుదల
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న 'సింహా' చిత్రం పాటలు డైరక్ట్ గా మార్కెట్లో ఈ రోజు (బుదవారం) విడుదలయ్యాయి. ఈ విషయాన్ని నిర్మాత పరుచూరి కిరీటి మీడియాకు తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ...'బాలకృష్ణ నటనలో భిన్న కోణాల్ని ఆవిష్కరించారు. ఆయన గెటప్స్‌కి మంచి స్పందన వస్తోంది. చక్రి వీనుల విందైన స్వరాలను అందించారు. పాటలను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాం. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఏప్రిల్ 16న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఇక దర్సకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ..."ఆకలిగొన్న సింహం వేటకు బయలుదేరితే ఎదుటున్నది మదగజమైనా సరే మట్టి కరవాల్సిందే... ఇందులో బాలకృష్ణ పాత్ర చిత్రణ అలాగే ఉంటుంది. ఇప్పటి వరకూ చూసిన బాలకృష్ణ వేరు. 'సింహా'లో చూడబోతున్న బాలకృష్ణ వేరు. ఇది ఒక దర్శకుడిగా చెబుతున్న మాట కాదు. ఒక ప్రేక్షకుడిగా చెబుతున్నమాట. బాలయ్య సినిమా సరైన విజయం సాధిస్తే...దాని ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో..మరోమారు తెలిపే సినిమా ఇది' అన్నారు. నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్.. కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: చక్రి, కెమెరా: ఆర్థర్.ఎ.విల్సన్, కళ: ఎ.ఎస్.ప్రకాష్ సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











