»   » మోక్షజ్ఞ ఎంట్రీ ఎందుకు లేటయ్యింది? కారణం ఏమిటంటే....

మోక్షజ్ఞ ఎంట్రీ ఎందుకు లేటయ్యింది? కారణం ఏమిటంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా లాంచ్ చేస్తాడా అని నందమూరి అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై బాలకృష్ణ కూడా ప్రత్యేక శ్రద్ద కనపరుస్తున్నారు. సరైన కథ, సమయం రాగానే లాంచ్ చేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సమయం ఎప్పుడు అన్నది ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంది.

న‌ట‌ర‌త్న నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి ఇప్పుడిప్పుడే అడుగలు పడుతున్నాయి. బాల‌య్య వందో చిత్రం శాత‌క‌ర్ణితోనే మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఈ సినిమాలో మోక్షు క‌నిపించ‌లేదు. దాంతో నందమూరి అభిమానులు కొంత నిరాశపడ్దా పూర్తి స్తాయి హీరోగా చూడాలన్న అభిలాషవల్ల పెద్దగా పట్టించుకోలేదు... అయితే ఈ సంవత్సరమే వచ్చేస్తుందనుకున్న మోక్షజ్ఞ సినిమా కనుచూపు మేరలో కూడా కనిపించటం లేదు....

Nandamuri Balakrishna's Son Mokshagna's entry

దానికి కారణం బాలయ్య మదిలో ఉన్న దర్శకులెవరూ ప్రస్తుతం ఖాళీగా లేకపోవడమే. మోక్షజ్ఞ మొదటి సినిమాకు రాజమౌళి, త్రివిక్రమ్‌, కొరటాల శివ, బోయపాటి శ్రీను.. వీళ్లలో ఎవరో ఒకరిని డైరెక్టర్‌గా అనుకుంటున్నాడట బాలయ్య. ఎందుకంటే మొదటి సినిమానే ఎవరో ఒకడర్శకుడి చేతిలో పెట్టి ఆ సినిమా అటా ఇటా అని ఆందోళన పడేఅకంటే ఎంట్రీనే గ్రాండ్ గా ఉండాలని చూస్తున్నాడట బాలయ్య.

"నాకు ముందస్తు ప్రణాళికలు వేసుకుని పనిచేయడం నచ్చదు. అప్పటికప్పుడు వేడివేడిగా వడ్డించేయడమే తెలుసు" అని గతం లో ఒకసారి మోక్షజ్ఞ సినిమా ప్రస్తావనకు వచ్చినప్పుడు అన్నారు అన్నారు బాలయ్య. సో పైన ఉన్న దర్శకుల్లో ఎవరో ఒకరు కాస్త ఫ్రీ అయినా, లేదంటే బాలకృష్ణని మెప్పించగల కథ తో వేరే దర్శకుడెవరైనా తగిలితే ఆ వెనువెంటనే సినిమా మొదలైనా ఆశ్చర్య పోనవసరం లేదు... అప్పటిదాకా అభిమానులంతా అలా ఎదురు చూడటమే తప్ప చేసేదేం లేదు మరి.

English summary
Nandamuri Fans still in Confusion about Nandamuri Mokshagna"s debut Movie, Nandamuuri Team not yet Conformed when he will appears on Silver screen....
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu