twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆంధ్రాలో ఆలయాల ధ్వంసం.. రాజధాని లేని దిక్కులేని రాష్ట్రం.. ఏపీ సర్కారుపై బాలకృష్ణ ధ్వజం

    |

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు మధ్య జరుగుతున్న వివాదంపై ఘాటైన వ్యాఖ్యలకు అఖండ థ్యాంక్యూ మీట్ వేదికగా నిలిచింది. నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోబొతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ సందర్బంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ సమాధానం ఇస్తూ..

    టికెట్ల రేట్లపై సమిష్టి నిర్ణయం

    టికెట్ల రేట్లపై సమిష్టి నిర్ణయం

    తెలుగు సినిమా పరిశ్రమకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికేలా ఓ నిర్ణయం తీసుకొంటాం. టికెట్ల రేట్ల వివాదం గానీ, ఇతర సమస్యల గురించి కానీ నేను ఒక్కడిని స్పందించడం సరికాదు. సినిమా పరిశ్రమకు చెందిన అందరూ చర్చించి.. తగు ప్రతిపాదనలను ప్రభుత్వం వరకు తీసుకెళ్లుతాం. టికెట్ రేట్లు ప్రధాన సమస్యగా మారింది. కరోనావైరస్ పరిస్థితుల్లో అందరూ కలిసి చర్చించుకోవాలి. ఫిలిం చాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇతర విభాగాలు సమావేశమై చర్చిస్తాం. ఆ ప్రపోజల్‌ను ప్రభుత్వం ముందు పెడుతాం అని బాలకృష్ణ అన్నారు.

    ఏపీలో పట్టించుకొనే నాథుడే లేడు..

    ఏపీలో పట్టించుకొనే నాథుడే లేడు..


    ఏపీ సర్కార్‌తో సినిమా పరిశ్రమ వివాదంపై నాకంటూ వ్యక్తిగతం అభిప్రాయం లేదు. ఆ వివాదం గురించి నేను ఆలోచించలేదు. ఈ సమస్య గురించి ఇండస్ట్రీ అంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. సినిమా నిత్యావసర వస్తువు అనేది ప్రభుత్వం పట్టించుకోవాలి. సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ అక్కడ పట్టించుకొనే నాథుడు ఉండాలి. సినిమా ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. సినీ పరిశ్రమ ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వం పరిశీలించాలి అంటూ సెటైర్ వేశారు.

    హిందూ దేవాలయాలపై దాడుల గురించి

    హిందూ దేవాలయాలపై దాడుల గురించి

    దేశంలోని పరిస్థితులతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను అన్వయించుకొనేలా అఖండ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయి. ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయం అనేక వేదికలపై చర్చ జరిగింది. సినిమా మాధ్యమం కాబట్టి హిందూ దేవాలయాలపై దాడులు గురించి చెప్పాలని అనుకొన్నాం. ప్రజా ప్రతినిధి, హిందూపూర్ ఎమ్మెల్యేగా నా అభిప్రాయాలను సినిమాగా చెప్పే ప్రయత్నం చేశాను అని బాలకృష్ణ అన్నారు.

    రాజధాని లేని దిక్కులేని రాష్ట్రంగా ఏపీ

    రాజధాని లేని దిక్కులేని రాష్ట్రంగా ఏపీ

    కులం, మతం పేరుతో ప్రాంతాలుగా విడగొట్టాలనే ప్రయత్నాలు, దుష్ణప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ప్రాంతాలుగా విడగొడుతారా అనే డైలాగ్ పెట్టడం జరిగింది. రాజధాని లేకుండా దిక్కులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. మూడు చోట్ల రాజధాని అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. అమరావతిలో రాజధాని ఏర్పాటు కోసం రైతులు, ప్రజలు పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను అన్వయించుకొనేలా అఖండలో సన్నివేశాలు ఉన్నాయనడంలో తప్పేమి లేదు. ఆ ఉద్దేశంగానే పలు రకాలు సందేశాలు ఇవ్వాలని అఖండలో ప్లాన్ చేశాం అని బాలకృష్ణ తెలిపారు.

    స్వర్గీయ ఎన్టీఆర్ అభిమతం అదే..

    స్వర్గీయ ఎన్టీఆర్ అభిమతం అదే..

    కులం, మతం, ప్రాంతం అనే భేదాభిప్రాయాలు లేకుండా తెలుగు రాష్ట్రం కలిసికట్టుగా ఉండాలనేది స్వర్గీయ ఎన్టీ రామారావు అభిమతం. అందుకే తెలుగు జాతి మనది.. ఆంధ్రా నాది, తెలంగాణ, రాయలసీమ నాది అంటూ తన సినిమాలో స్పూర్తిని రగలించారు. అందుకు విరుద్ధంగా కొన్ని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నాయి అని బాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    Recommended Video

    Nandamuri Balakrishna With His Family At Pushpa Movie Special Screening | Filmibeat Telugu
    ఏపీ, సినిమా పరిశ్రమ వివాదంపై నిర్మాత అభ్యంతరం

    ఏపీ, సినిమా పరిశ్రమ వివాదంపై నిర్మాత అభ్యంతరం

    అయితే అఖండ థ్యాంక్యూ మీట్‌లో ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు సంబంధించిన వివాదంపై మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడగడంపై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. అఖండ అద్భుతమైన విజయం సాధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ప్రదర్శన రెండు వారాలకు, ఒక వారం, మూడు రోజులకు పరిమితమైంది. అలాంటి వాటిని బ్రేక్ చేసి అఖండ 50 రోజుల పూర్తి చేసుకోబోతున్నది. కాబట్టి వివాదాలను పరిష్కరించడానికి ఫిలిం చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. కాబట్టి ఈ వేదికను సినిమా సెలబ్రేషన్‌కు పరిమితం చేయండి. ఈ వేడుకను డైవర్ట్ చేయవద్దు అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అభ్యర్థించారు.

    English summary
    Nandamuri Balakrishna's Akhanda running successful in Theatres. This movie is going to celebrate 50 days function soon. In this occassion, Akhanda team organised Thanks meet in hyderabad. In this event, Nandamuri Balakrishna satire on Andhra Pradesh Governemnt over Temple attack
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X