యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా చేశాడు.. బాలయ్య సీక్రెట్ రివీల్ చేసిన బోయపాటి
Recommended Video
నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినీ చరిత్రలో చెప్పుకోదగ్గ హీరోలలో ఒకరు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. గతంలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన.. కొద్దిరోజులుగా స్పీడును తగ్గించారు. రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత మరింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్పీడు పెంచేశారు. ఇందులో భాగంగానే కొత్త సినిమా షూటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా బాలకృష్ణకు సంబంధించిన సీక్రెట్‌ను బోయపాటి శ్రీను రివీల్ చేశారు.

కేఎస్ రవికుమార్ సినిమా
గతంలో ‘జై సింహా' వంటి సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో బాలయ్య మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ, షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే, ఇటీవల థాయ్‌లాండ్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌లో కీలక నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించారు.

బాలకృష్ణ రెండు షేడ్స్‌లో...
ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనేదే సినిమా కథ అని ఫిలింనగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఇందులో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నారు.

సరికొత్త లుక్‌లో బాలయ్య
ఈ సినిమా బాలకృష్ణ ఏ పాత్రలో కనిపిస్తారన్న దానిపై ఎటువంటి క్లారిటీ లేకపోయినా.. తాజాగా ఆయనకు సంబంధించిన లుక్స్ కొన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వీటిలో బాలయ్య సన్నగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ కట్ షేవ్‌తో హ్యాండ్సమ్‌గా దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, ఈ పిక్స్‌లో బాలయ్య వయసు తగ్గిపోయిందన్నట్లుగా ఉంది. దీంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ లుక్కుల వెనుక రహస్యం ఇదే
బాలయ్య ఈ సినిమా కోసం ఎంతగానో కష్ట పడుతున్నట్లు తెలుస్తోంది. తన అభిమానులకు ఎలాగైనా మంచి సినిమాను అందించాలన్న కసితో పని చేస్తున్న బాలయ్య.. అదే సమయంలో తనలో తాను కొంత మార్పులు కూడా చేసుకుంటున్నారని సమాచారం. ఇందులో భాగంగానే సన్నగా అవడం కోసం ఆయన రోజుకు ఐదు గంటల పాటు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారట. ఈ కారణంగానే ఆయన లుక్‌లో వేరియేషన్ కనిపిస్తుందని టాక్.

బోయపాటి వ్యాఖ్యలు
ఆదివారం జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌కు బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన హీరోలపై పలు వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా కోసం ఎంతో మంది హీరోలు తమ శరీరాకృతిని మార్చుకోడానికి కష్టపడుతున్నారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ ఇలా చాలా మంది సిక్స్ ప్యాక్‌లు చేశారు. వీళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా బాలయ్య బాబు 11 కేజీలు తగ్గారు' అని చెప్పుకొచ్చారు. బాలయ్య బరువు తగ్గాడని తెలుసు కానీ, మరీ 11 కేజీలు లాస్ అయ్యాడని సరికొత్త విషయం చెప్పాడు బోయపాటి.


Click it and Unblock the Notifications











