ఆ సినిమా తర్వాత రోడ్డు మీదకు.. ఆ ప్లాన్ వేశా: లీకైన కాల్ రికార్డులో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే చాలా కాలంగా తన హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. తారక రామారావు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనలోని టాలెంట్లతో మంచి పేరును దక్కించుకున్నారు. తద్వారా ఎన్నో విజయాలను అందుకుని స్టార్ హీరోగా మారిపోయారు. దాదాపు నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తోన్న ఆయన.. పాలిటిక్స్‌లోనూ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ మాట్లాడిన కాల్ రికార్డు లీకైంది. అందులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Balakrishna Comments On Corona Vaccine
కథ అడ్డం తిరిగింది.... వరుసగా ఫ్లాపులే

కథ అడ్డం తిరిగింది.... వరుసగా ఫ్లాపులే

కెరీర్ ఆరంభంలో ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ వచ్చారు నందమూరి బాలకృష్ణ. అయితే, ఈ మధ్య వేగం తగ్గించిన ఆయన కనీసం రెండు సినిమాలతోనైనా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే, ఊహించని విధంగా పోయిన సంవత్సరం ఆయన ఏకంగా మూడు సినిమాలను విడుదల చేశారు. దురదృష్టవశాత్తూ అవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

 మూడోసారి కలిశారు.. హ్యాట్రిక్ కొడతారా?

మూడోసారి కలిశారు.. హ్యాట్రిక్ కొడతారా?

వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటోన్న బాలకృష్ణ.. ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తనకు గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టాడు. అంతకు ముందు వచ్చిన రెండు సినిమాలకు మించిన హిట్‌తో హ్యాట్రిక్ కొట్టాలని ఈ కాంబో భావిస్తోంది.

 బాలయ్య కెరీర్‌లో ఫస్ట్ టైమ్.... భారీగానే

బాలయ్య కెరీర్‌లో ఫస్ట్ టైమ్.... భారీగానే

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కెరీర్‌లోనే తొలిసారి యాభై కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. ఇక, ఈ సినిమాలో నటసింహా రెండు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి అఘోరా పాత్ర అని కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

అంచనాలతో పాటు ప్రీ బిజినెస్ పెరిగింది

అంచనాలతో పాటు ప్రీ బిజినెస్ పెరిగింది

వాస్తవానికి క్రేజీ కాంబినేషన్ అయినప్పటికీ ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. దీంతో ఈ ప్రాజెక్టును కొనుగోలు చేసేందుకు బయ్యర్లు కూడా ముందుకు వచ్చేలా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో BB3 పేరిట ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పవర్‌ఫుల్‌గా సాగిన ఈ వీడియోకు అన్నీ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఫలితంగా సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.

 ఫ్యాన్స్‌తో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ఫ్యాన్స్‌తో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. అందుకే తరచూ ఆయన తన అభిమానులతో ఫోన్‌లో సంభాషిస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడి ద్వారా ఫ్యాన్స్‌తో మాట్లాడారాయన. ఈ సందర్భంగా తన రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కాల్ రికార్డ్ బయటకు వచ్చింది.

ఆ సినిమా తర్వాత రోడ్డు మీదకు వస్తున్నా

ఆ సినిమా తర్వాత రోడ్డు మీదకు వస్తున్నా

తన అభిమానులతో మాట్లాడుతూ.. 'బోయపాటి సినిమా షూటింగ్ అయిపోగానే.. రోడ్ల మీదకు వస్తున్నా. అందుకోసం ప్లాన్ చేసుకుంటున్నా. మానసికంగానూ సిద్ధం అవుతున్నా. రాష్ట్రంలో రాక్షస పాలన కనిపిస్తోంది. రౌడీయుజం ఎక్కువైపోయింది. అన్నింటిపై పోరాటానికి సిద్ధం అవుతున్నా. నా అసలు స్వరూపం చూపిస్తా' అంటూ వివరించారు నటసింహా నందమూరి బాలకృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X