For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు: ఆ బాధ్యతను నేను తీసుకుంటా అంటూ షాకింగ్‌గా!

  |

  ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా తన సత్తాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అదే వారసత్వాన్ని తీసుకుని రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అక్కడ కూడా తన మార్కును చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఇలా రెండు రంగాల్లో రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

  ‘అఖండ'గా రాబోతున్న బాలకృష్ణ

  ‘అఖండ'గా రాబోతున్న బాలకృష్ణ

  కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీనుతో ‘అఖండ' అనే సినిమాను చేస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. శ్రీకాంత్, పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది.

   ఒకటి ఉండగానే మరికొన్ని లైన్‌లో

  ఒకటి ఉండగానే మరికొన్ని లైన్‌లో

  ‘అఖండ' పట్టాలపై ఉండగానే బాలయ్య తన 107వ సినిమాను ప్రకటించారు. ‘క్రాక్'తో భారీ విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఫ్యాక్షన్ నేపథ్యంతో రాబోతుందని టాక్.

  మారుమ్రోగిపోయిన బాలయ్య పేరు

  మారుమ్రోగిపోయిన బాలయ్య పేరు

  జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఆయన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోగా.. ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ అయింది. ఇక, బాలయ్య మాత్రం తన పుట్టినరోజును బసవ తారకం ఆస్పత్రిలోని క్యాన్సర్ పేషెంట్ల మధ్యలో సెలబ్రేట్ చేస్తున్నారు.

   ఇద్దరు అల్లుళ్లపై బాలయ్య కామెంట్

  ఇద్దరు అల్లుళ్లపై బాలయ్య కామెంట్


  పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఇద్దరు అల్లుళ్లు లోకేష్, శ్రీ భరత్ గురించి మాట్లాడారు. ‘వాళ్లిద్దరూ మంచి వర్కర్స్. జనాలతో కలిసిపోయే తత్వం వాళ్లది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నారు. వాళ్లిద్దరి పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

   ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందన

  ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందన

  చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అతడు తెలుగుదేశం పార్టీలోకి రావాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, పార్టీ బాధ్యతలను సైతం తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు.

   నాకైతే ఎలాంటి బాధ లేదు అంటూ

  నాకైతే ఎలాంటి బాధ లేదు అంటూ

  ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లది. వాళ్ల ఇష్టాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఈ విషయంపై మాత్రం నేను దిగులు చెందడం లేదు. వస్తాడా రాడా అన్న విషయంపై నేను ఆలోచించడం లేదు' అంటూ పేర్కొన్నారు.

  ఆయనలా ఎవరూ కాలేరంటూ షాక్

  ఆయనలా ఎవరూ కాలేరంటూ షాక్

  ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందా అని యాంకర్ అడగగా.. ‘మైనస్ అయితే ఏం చేస్తారు? ప్లస్ ప్లస్ అయితే ప్లస్.. మైనస్ ప్లస్ అయితే మైనస్' అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అంతేకాదు, ‘సినిమా హీరోగా ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారని.. అందరూ అలా అవుతారు అనుకోకూడదు. నేను వేరే అందుకే సక్సెస్ అయ్యాను' అని బాలయ్య చెప్పుకొచ్చారు.

   ఆ బాధ్యతను నేను తీసుకుంటున్నా

  ఆ బాధ్యతను నేను తీసుకుంటున్నా

  పార్టీ గురించి బాలయ్య మాట్లాడుతూ.. ‘తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆవేశం నుంచి. అలాంటి వాళ్లకే పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. మొన్న జరిగిన మహానాడు కార్యక్రమంలో కూడా ఇదే చెప్పా. మనం యువతను పట్టించుకోవడం లేదు. ఆ బాధ్యతను నాకు అప్పగించేయండి. నేను చూసుకుంటాను అన్నాను. ఎందుకంటే నాకింకా పదహారేళ్లే కదా' అంటూ వివరించారు.

  English summary
  Nandamuri Balakrishna Recenlty Participated in An Interview. In This Chit Chat He Sensational Comments on Tollywood Star Hero Jr NTR Political Entry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X