Balayya: Jr.NTR పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఐ డోంట్ కేర్ అంటూ...

నందమూరి నటసింహం బాలకృష్ణ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై.. ఆయన మాట్లాడుతూ... జూనియర్ ఎన్టీఆర్ పై సెన్సెషన్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్ పై బాలయ్య బాబు ఏం వ్యాఖ్యలు చేశారు.. ఎందుకు అలా అన్నాడు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టీడీపీ బాధ్యతలను భూజలపై..

నందమూరి వారసుడు నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలు చేస్తూ.. అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవెల్మెంట్ విషయంలో అరెస్టు అయ్యారు. ఆయనకు కోర్టు రిమాండ్ కూడా విధించింది. అయితే ఈ నేపథ్యంలో బాలయ్య బాబు ఆయన భూజాలపై టీడీపీ బాధ్యతలను వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు.

Balakrishna TDP

జూ.ఎన్టీఆర్ నో రెస్పాన్స్...

ఇక చంద్రబాబు అరెస్టుపై ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించారు. అయితే సినిమా పెద్దలు స్పందించడం లేదని ముఖ్యంగా నందమూరి వారసుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం చర్చనీయాంశం అయింది. అటు టీడీపీ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్.. అంతా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని కోరారు. కొంత మంది మాత్రం స్పందించకపోవడం ఉత్తమమని సలహాలు కూడా ఇచ్చారు.

Nandamuri Balakrishna Sensational Comments on Junior NTR Over Chandrababu Arrest News Goes Viral

ఐ డోంట్ కేర్...

ఇక ఇటీవల సప్తసాగరాలు దాటి ప్రెస్ మీట్లో పాల్గొన్న సురేష్ బాబును చంద్రబాబు అరెస్టుపై అడిగారు. దానికి ఆయన.. సినిమా రంగంలోకి రాజకీయాలు తీసుకురావొద్దని సాఫ్ట్ గా చెప్పుకువచ్చారు. అయితే తాజాగా బాలయ్య బాబు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రెస్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు గురించి సినీ రంగం నుంచి ఎవరు స్పందించకపోయినా పట్టించుకోను అంటూ చెప్పుకు వచ్చారు. ఇక ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించుకున్నా డోంట్ కేర్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కేంద్రాన్ని సంప్రదిస్తా...

ఇక అక్క పురందేశ్వరితో కలిసి ముందుకు వెళ్తానని చెప్పుకు వచ్చారు బాలయ్య. ఇక చంద్రబాబుపై రాజకీయ కక్ష్యతోనే అబద్ధపు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం హస్తం ఉందో లేదో తమకు తెలియదని.. కానీ తాము ఎవరిపైనా అనవసరంగా నిందలు వేయమని వెల్లడించారు. ఈ విషయంపై తప్పకుండా కేంద్ర పెద్దలను కలుస్తానని బాలయ్య వివరించారు.

రోజాపై కీలక వ్యాఖ్యలు...

ఇక రోజా వ్యాఖ్యలపై బాలయ్య మాట్లాడుతూ... బురద మీద రాయి వేస్తే మన మీదే పడుతుందని సెటైర్ వేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చేది టీడీపీ అని ధీమా వ్యక్తం చేశారు. బాలయ్య... ఎన్టీఆర్ పై ఐ డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది. ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X