జగన్ నా అభిమాని.. బాలయ్య క్లారిటీ.. చిరు, పవన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

By Manoj Kumar P

అద్భుతమైన టాలెంట్‌తో టాలీవుడ్‌లో టాప్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ రూపంలో బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ఆయన ఎంతగానో శ్రమించారు. అంతేకాదు, విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ అయ్యారు.

దీంతో భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. అందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఒకరని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజా ఇంటర్వ్యూలో బాలయ్య దానికి క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

బాలయ్యకు కలిసిరాని అదృష్టం.. హ్యాట్రిక్ ఫ్లాప్స్

బాలయ్యకు కలిసిరాని అదృష్టం.. హ్యాట్రిక్ ఫ్లాప్స్

నందమూరి బాలకృష్ణకు ఈ మధ్య అదృష్టం అంతగా కలిసి రావడం లేదు. అందుకే ఆయన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా 2019లో ఆయన నటించిన మూడు సినిమాలు ‘యన్.టి.ఆర్' బయోపిక్ రెండు భాగాలతో పాటు ‘రూలర్' విడుదలవగా... ఈ మూడూ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. దీంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

హిట్ ట్రాక్ ఎక్కేందుకు.. కలిసొచ్చిన డైరెక్టర్‌తో

హిట్ ట్రాక్ ఎక్కేందుకు.. కలిసొచ్చిన డైరెక్టర్‌తో

వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న నందమూరి హీరో బాలయ్య.. ఈ సారి ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే తనకు గతంలో రెండు సూపర్ హిట్ చిత్రాలు అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిశాడు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా', ‘లెజెండ్' వంటి భారీ విజయవంతమైన చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.

బాలయ్య గర్జన అదిరింది.. పరిస్థితి మారింది

బాలయ్య గర్జన అదిరింది.. పరిస్థితి మారింది

బోయపాటి - బాలయ్యది హిట్ కాంబినేషన్. అయినప్పటికీ ఈ చిత్రంపై ఏమాత్రం అంచనాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో నటసింహా పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆ మూవీ టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తోన్న ఈ చిత్రం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

బాలకృష్ణ కామెంట్స్... చెలరేగిన వివాదం

బాలకృష్ణ కామెంట్స్... చెలరేగిన వివాదం


ఎన్టీఆర్ జయంతి రోజున తనను ఇండస్ట్రీకి సంబంధించిన సమావేశాలకు పిలవడం లేదని సినీ పెద్దలపై విమర్శలు చేశారు నందమూరి బాలకృష్ణ. దీంతో పెద్ద వివాదం చెలరేగింది. అలాగే, తన పుట్టినరోజు సందర్భంగా ఆయన పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా తన సినీ, రాజకీయ సంబంధమైన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.

జగన్ తన అభిమానా అన్న దానిపై క్లారిటీ

జగన్ తన అభిమానా అన్న దానిపై క్లారిటీ


ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. బాలయ్య అభిమాని అని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, కొన్ని ఫొటోలు కూడా అప్పట్లో హల్‌చల్ చేశాయి. తాజా ఇంటర్వ్యూలో నటసింహా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘జగన్ నా అభిమానే. కడప టౌన్‌కు ఆయన ప్రెసిడెంట్ కూడా. పేపర్ ప్రకటననూ చూశాను' అని ఆయన చెప్పుకొచ్చారు.

చిరంజీవి, పవన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

చిరంజీవి, పవన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు


అదే ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి పరోక్షంగా కామెంట్లు చేశాడు బాలయ్య. ‘ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి రాణించడమంటే ఆశామాషీ వ్యవహారం కాదు. ఎన్టీఆర్‌కు అన్నీ కుదిరాయి. ఆ తర్వాత అది ఎవరికీ సాధ్యం కాలేదు. ఆల్రెడీ కొందరు ట్రై చేసి భంగపడిన దాన్ని మనం కళ్లారా చూశాం' అంటూ వివరించారు.

Recommended Video

#HBDNBK Birthday Special: Caricature Pic Of Chiru Balayya & Total Tolywood Heroes Goes Viral
మా బాలయ్య అంటూ చిరంజీవి ట్వీట్

మా బాలయ్య అంటూ చిరంజీవి ట్వీట్

జూన్ 10 (బుధవారం) నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ‘60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను' అని పోస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X