NBK 107: చొక్కా విప్పేసి ఊర మాస్ లుక్ లో బాలయ్య.. లోకేషన్ ఫొటోస్ లీక్

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయాన్ని తెలిసిందే. బాలయ్య 107వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లోకేషన్ ఫోటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. షూటింగ్లో బాలయ్య బాబు ఎలా ఉంటారో ఆ ఫోటోలో చూస్తే అర్థమవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బాలయ్య అన్ స్టాపబుల్

బాలయ్య అన్ స్టాపబుల్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తర్వాత బాలయ్య బాబు స్టార్ హోదా మల్లి ఒక్కసారిగా పెరిగిపోయింది. నేటి తరం జనరేషన్ మొత్తం కూడా జై బాలయ్య నినాదాలతో ఊగిపోతున్నారు అనే చెప్పాలి. అంతేకాకుండా ఓటీటీ లో బాలయ్య చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలోనే ఆ టాక్ షో సీజన్ 2 కూడా రానుంది.

ఫ్యాన్స్ కు నచ్చేలా..

ఫ్యాన్స్ కు నచ్చేలా..

అయితే బాలకృష్ణ అఖండ తరహా లోనే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న NBK 107వ సినిమా పై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయింది. బాలయ్య బాబు ఫస్ట్ లుక్ కూడా మామూలుగా లేదు. ఫ్యాన్స్ ఎలాగైతే బాలయ్య బాబును చూడాలని అనుకుంటున్నారో దర్శకుడు గోపీచంద్ అదే తరహాలో ప్రజెంట్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది.

లోలేషన్ లో బాలయ్య ఇలా..

లోలేషన్ లో బాలయ్య ఇలా..

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. ఇటీవల నెల్లూరు వెళ్ళిన బాలయ్య బాబు అక్కడ ప్రత్యేకంగా కొన్ని పొలిటికల్ కు సంబంధించిన సీన్స్ లో నటించినట్లుగా అర్థం అవుతుంది. అయితే బాలయ్య బాబు లొకేషన్ లో ఎంత సింపుల్ గా గా ఉంటారో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తేనే అర్థమవుతుంది.

చొక్కా విప్పేసి

చొక్కా విప్పేసి

ఇటీవల లీకైన ఒక ఫోటోలో బాలయ్య బాబు ఒక చైర్ లో కూర్చుని చొక్కా విప్పేసి ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేయడం అలాగే టీ కాఫీలు తీసుకోవడం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారుతున్నాయి. బాలయ్య బాబు సింపుల్ గానే ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు అని అర్థమవుతుంది.

కారావాన్ ఉన్నా కూడా..

కారావాన్ ఉన్నా కూడా..

బాలకృష్ణకు ఎంతో ఖరీదైన కారావాన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆయన దాన్ని అంతగా వాడరు అని ఇండస్ట్రీలో చాలామంది చెబుతూ ఉంటారు. ఎక్కువగా బాలయ్య బాబు పల్లెటూరి ప్రాంతాలలో షూటింగ్లో జరిగితే మాత్రం బయటే చెట్టు కింద కూర్చోవడానికి ఎక్కువ ఇష్టపడతారట. ఇక ప్రస్తుతం వైర్లు అవుతున్న ఫోటోలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక ఈ సినిమాను ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. అలాగే మొదటి పాటను త్వరలోనే విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X