అభిమాని గూబ గుయ్ మనిపించిన బాలకృష్ణ.. ఫ్యాన్స్‌కు బాలయ్య చేతిలో చెంపదెబ్బ సీన్ రిపీట్
సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రేమను, ఆగ్రహాన్ని తట్టుకోవడం కష్టమే అనేది పలు సందర్భాల్లో రుజువైంది. తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించే ఫ్యాన్స్‌ను లాగి కొట్టిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.అయితే తాజా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలయ్య మరోసారి అభిమానిపై చేయి వేసుకొన్నాడు. ఈ విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. తనను అమితంగా ప్రేమించే యువకుడిని చేజేసుకోవడానికి కారణం ఏమిటంటే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. హిందూపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పాదయాత్రగా చేపట్టిన కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కిక్కిరిసిన జనం మధ్య బాలయ్య నడుస్తూ ప్రజలను ఆకట్టుకొనే విధంగా ప్రయత్నించడం కనిపించింది.

బాలయ్య చేపట్టిన కార్యక్రమంలో ఊహించిన దానికంటే ఎక్కువగా జనం తరలిరావడంతో తోపులాట జరిగింది. అభిమానులు తమ ఇష్టమైన హీరోను తాకేందుకు తహతహలాడారు. బాలయ్యను తాకేందుకు ఆరాటపడ్డారు. సెల్ఫీలు తీసుకొనేందుకు ఫ్యాన్స్ పోటేత్తారు.దాంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొన్నది.
అయితే బాలయ్యను తాకేందుకు అభిమాని అనుమానాస్పదంగా తోసుకొంటూ వచ్చారు.అతడిని ఆపేందుకు ప్రయత్నించిన ప్రయత్నాలు సఫలమయ్యాయి.దాంతో తనపైకి దూసుకొస్తున్న యువకుడిని లాగి గూబపై గుయ్ మనిపించేలా బాలకృష్ణ కొట్టాడు.దాంతో మరోసారి అభిమానిపై చేయిచేసుకొన్నాడనే వార్త ట్రెండింగ్‌లోకి వచ్చింది.
అయితే వాస్తవంగా రాజకీయనేతలు, సినిమా హీరోలు తమను తాము జనం బారిన పడకుండా ఉండేందుకు ప్రైవేట్ సైన్యాన్ని, అంగరక్షకులనుప పెట్టుకొంటారు. కానీ బాలయ్య మాత్రం అందుకు విరుద్దం. దాంతో ఆయనపైకి తోసుకొచ్చి తాకేందుకు, సెల్పీలు దిగేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో తన కాళ్లు తొక్కడం, తనను నెట్టివేయడం సహించలేక కొట్టడం జరుగుతుందని బాలయ్య స్వయంగా చెప్పారు.
అయితే బాలయ్యతో దెబ్బలు తినడం మాకు ఆనందంగా ఉంటుందని ఆయన అభిమానులు చెబుతుంటారు. మేము తాకితే చాలు అని అనుకొంటే.. మమల్ని ఆయనే కొట్టడం జరిగితే అంతకంటే ఏముంటుంది అని అభిమానులు కూడా చెప్పడం తెలిసిందే. తాజాగా బాలయ్య ప్రేమను అభిమాని దెబ్బ రూపంలో పొందడాని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











