అభిమానులని కొట్టిన బాలయ్య, కాలితో తన్నాడు.. ఆగ్రహంతో ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్న ఫ్యాన్స్!
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో మారు వార్తల్లో నిలిచారు. ఇటీవల బాలకృష్ణ తరచుగా వివాదాస్పద ఘటనలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య అభిమానులపై చేయి చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ప్రచారం కోసం బాలకృష్ణ తెలంగాణాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రచారంలో భాగంగా
తెలంగాణాలో ఎన్నికలు త్వరలో జరగనుండడంతో టిడిపి ముందుగా బాలయ్యని ప్రచారంలోకి దించింది. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న బాలయ్య తల్లాడ నుంచి మిట్టపల్లి బయలుదేరారు. మిట్టపల్లిలో అభిమానులు బాలయ్య కిశోరం ఘనమైన ఏర్పాట్లు చేసారు.

బాలయ్య రాగానే
బాలయ్య రాగానే అభిమానులు కాన్వాయ్ చుట్టూ చేరాడు. కాన్వాయ్ కదలకపోవడంతో ఆగ్రహానికి గురైన బాలయ్య కిందకు దిగి అభిమానులపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో బాలయ్యపై అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

కాలితో తన్నాడు అంటూ
కొంత మంది అభిమానులని బాలయ్య కాలితో కూడా తన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. షేక్ లాలూ, రమేష్, కృష్ణయ్య అనే అభిమానులని బాలయ్య కొట్టినట్లు తెలుస్తోంది. అభిమానంతో బాలయ్యని చూడడానికి వస్తే కొట్టడం ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఫ్లెక్సీలు ధ్వంసం
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన బాలయ్య అభిమానులు ఫ్లెక్సీలు ధ్వంసం చేసి తగలబెట్టారు. బాలయ్య క్షమాపణ చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని అంటున్నారు. బాలయ్య దురుసు ప్రవర్తన పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











