VarunLuv: వరుణ్ లావణ్యలకు బాలకృష్ణ స్పెషల్ గిఫ్ట్... లైఫ్ లాంగ్ గుర్తుండి పోయేలా!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఇటలీలో ఇరు కుటుంబాల సమక్షంలో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు వచ్చి హాజరు అయ్యారు. ఇక కొంత మందికి పెళ్లి పత్రిక పిలిచిన రాలేకపోయారు. ఇక బాలయ్య వీరి కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారట. వరుణ్ తేజ్, లావణ్యలకు లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే విధంగా ఓ ప్రత్యేక గిఫ్టును బాలయ్య పంపించారట. అసలు ఆ గిఫ్ట్ ఏంటి.. బాలయ్య ఆ గిఫ్ట్ నే ఎందుకు పంపారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే. వరుసగా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇటీవల మూడు ముళ్ల బంధంతో వరుణ్ తేజ్ లావణ్య ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక వీరి 5 ఏళ్ల సీక్రెట్ ప్రేమకు పెద్దలు ఓకే చెప్పడంతో ఇటలీలో అంగరంగ వైభవంగా ఇరుకుటుంబాల సమక్షంలో జరిగింది. ఇక ఈ పెళ్లికి ఇప్పటికే మెగా కుటుంబం, అల్లు కుటుంబంతో పాటు.. లావణ్య కుటుంబం కూడా హాజరు అయింది. ఇక సీని ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు సైతం హాజరు అయ్యారు.

Nandamuri Balakrishna Special Gift To Varun Tej and Lavanya Tripathi

ఇక ఈ నేపథ్యంలోనే కొత్త జంటకు నందమూరి బాలకృష్ణ అదిరిపోయే గిఫ్ట్ పంపించాని తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న హైదరాబాద్ కు వచ్చిన ఈ జంటకు బాలయ్య ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారట. నూతన వధూవరులకు అదిరిపోయే గిఫ్ట్ పంపించాడంటూ నెట్టింట హాల్ చల్ చేస్తుంది. నాగబాబు ఆయన భార్య వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారని తెలిసిందే. అంతేకాదు వరుణ్ తేజ్ కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ ఉంటాటరట.

ఈ క్రమంలోనే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పెద్ద ఫోటోగ్రఫీని చేయించి బాలయ్య గిఫ్టుగా పంపారట. స్పెషల్ గా ఆకర్షణీయంగా కనిపించే వెంకటేశ్వర స్వామి ఫోటోను గిఫ్ట్ చేసించి... మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ బ్లెస్స్ చేస్తూ గ్రీటింగ్ కార్డు కూడా పంపించారని తెలుస్తోంది. బాలకృష్ణ తలుచుకుంటే కోటి రూపాయలు పెట్టి గిఫ్ట్ పంపించవచ్చు. కానీ అంతకన్నా విలువైన ఆశీర్వాదాలను ఆ దేవుడు ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉండాలి అని వాళ్ళ ఫేవరెట్ దేవుడినే వాళ్ళ ఇంటికి పంపించారని నెట్టింట ఓ న్యూస్ వైరల్ గా మారింది.

Nandamuri Balakrishna Special Gift To Varun Tej and Lavanya Tripathi

ఇక వరుణ్ తేజ్ లావణ్యల రిసెప్షన్ ఈరోజు సాయంత్రం మాధపూర్లో జరగనుంది. ఈ వేడుకకు సీని ప్రముఖుల నుంచి రాజకీయ ప్రమఖులు హాజరు కానున్నారు. ఇక నూతన వధూవరులను ఆశీర్వాదించి వెళ్లనున్నారు. ఇటలీకి రాని వారంతా ఇక్కడ సందడి చేయనున్నారు. ఇక మొత్తానికి వరుణ్ తేజ్, లావణ్యను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడని నెట్టింట అభిమానులు ఖుషి అవుతున్నారు. ఆయనకు, లావణ్యకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X