twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ స్పీచ్ ట్రెండింగ్.. పూజాపై పొగడ్తలు.. ఎన్టీఆర్‌ను మరిచారే.. మీడియాలో రచ్చ!

    |

    Recommended Video

    బాలకృష్ణ స్పీచ్ ట్రెండింగ్.. పూజాపై పొగడ్తలు

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్యూటీ పూజా హెగ్డే నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేడుకలో పూజా హెగ్డే అందాన్ని పొగడుతూ బాలయ్య చేసిన ప్రసంగం ఇంటర్నెట్‌లో మోత మోగిస్తున్నది. ఇంతకీ బాలయ్య చెప్పినదేమిటంటే..

    షాకింగ్: అరవిందను తొక్కేసిన హలో గురూ.. బాక్సాఫీస్ వద్ద దూకుడు.. ఇంకా నష్టాల్లోనే.. షాకింగ్: అరవిందను తొక్కేసిన హలో గురూ.. బాక్సాఫీస్ వద్ద దూకుడు.. ఇంకా నష్టాల్లోనే..

    హిందీ, ఇంగ్లీష్‌లో స్పీచ్ ఇలా

    హిందీ, ఇంగ్లీష్‌లో స్పీచ్ ఇలా

    బాలకృష్ణ తన ప్రసంగంలో.. మోస్ట్ వైబ్రంట్. స్పార్కింగ్లీ, స్పేరింగ్లీ. క్యాప్టివేటింగ్ ఇన్ కూల్ పూజా హెగ్డే. అంటూ ఆంగ్లంలో స్పీచ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత హిందీలోకి దిగి.. లాగ్తా హైకి ఆస్మాన్‌తో ఫరిస్తే ఉతర్కే.. సంఘే మర్ మర్కే. హర్ ఖలీ మస్తే మస్తే హోజాతీ హై.. పత్తి పత్తి గులాబ్ హోజాతి హై. తూనా డాలీ మై ఫిదా నజరియా.. వర్ణా షబ్నమ్ షరాబ్ హోతా హై అంటూ బాలకృష్ణ తన మార్కుతో స్పీచ్‌ను అదరగొట్టారు.

    తెలుగు అనువాదంతో

    సినీ పరిశ్రమలో భారీగా అవకాశాలు చేజిక్కించుకొంటున్న.. మెరుపు చుక్క. కూల్‌గా నటనను ప్రదర్శిస్తున్న పూజా భట్‌ను చూస్తే కొన్నిమాటలు చెప్పాలనిపిస్తున్నదని బాలకృష్ణ అన్నారు. దాంతో పూజా హెగ్గే కొంచెం సిగ్గు.. మరికొంత ఆనందంతో పూజా బుగ్గలు ఎరుపెక్కాయి.

    దివి నుంచి దిగివచ్చిన

    దివి నుంచి దిగివచ్చిన

    దివి నుంచి దేవతలు దిగివచ్చినట్టుగా పూజా అందం ఉంది. ఒక్కొ పూరెక్క కలిసి గులాబిలా మారినట్టు కనిపిస్తుంది. నీపై చూపు పడితే మంచు కూడా మధురసంగా మారిపోతుంది అంటూ తన హిందీ పాండిత్యాన్ని వేదికపై బాలకృష్ణ ప్రదర్శించాడు. బాలయ్య మాటలకు పూజా హెగ్డే తబ్బిబ్బయింది. సిగ్గుతో కూడిన సంతోషంతో అటూ ఇటూ చూస్తూ తనలోతాను పొంగిపోయింది.

    పూజాపై జగపతిబాబు కూడా

    పూజాపై జగపతిబాబు కూడా

    అరవింద సక్సెస్ మీట్‌లో జగపతిబాబును పూజా హెగ్డే ప్రశంసలతో ముంచెత్తింది. ఆయన ఓ రాక్ స్టార్ అంటూ ప్రశంసించారు. పూజా హెగ్డే మాటలకు సమాధానం ఇస్తూ.. నేను రాక్ స్టార్ కాదు. చార్టెడ్ ఫ్లయిట్‌లో షూటింగ్‌కు వచ్చే పూజా హెగ్డేనే రాక్ స్టార్ అంటూ జగపతిబాబు ప్రశంసించారు. ఇలా పూజా హెగ్డేను ప్రశంసలతో ముంచెత్తడం సక్సెస్ మీట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

    ఎన్టీఆర్‌ను మరిచారేంటి?

    ఎన్టీఆర్‌ను మరిచారేంటి?

    పూజా హెగ్డేను పొగడ్తలతో ముంచెత్తిన బాలకృష్ణ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను మరిచిపోయారు. అందరి గురించి ప్రత్యేకంగా మాట్లాడిన బాలయ్య.. ఎన్టీఆర్‌ గురించి మాట్లాడకపోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే హడావిడిలో బాలయ్య మరిచిపోయి ఉంటారని అభిమానులు సర్దిచెప్పుకొంటున్నారు.

    English summary
    Nandamuri Balakrishna will be the Chief Guest for Aravindha Sametha Success Meet Tomorrow at Shilpakala Vedika, HyderabadNBK - Jr NTR on the Same Stage after 7 Long Years.They were seen together Parama Veera Chakra Audio Launch earlier.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X