మా అన్నయ్య మొరటు... నేను, తారక్ చేసేవి ఇతరులకు అసాధ్యం: బాలయ్య

ఎన్టీఆర్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కినప అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకోవడంతో హైదరాబాద్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన అన్నయ్య, దివంగత నటుడు హరికృష్ణ గురించి గుర్తు చేసుకున్నారు.

ప్రజా శ్రేయస్సు, పేదల సంక్షేమం కోసం తెలుగు దేశం పార్టీ తొలి దశలోనే శ్రమించిన ఒక శ్రామికుడు మా అన్నయ్య నందమూరి హరికృష్ణగారు శివైకం కావడం నా మనసును ఎంతో ద్రవ్య పరిచింది. ఆయన ముక్కుసూటి మనిషి, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి లాభ నష్టాలు బేరీ వేయకుండా ధైర్యంగా ముందుకు సాగే ధీశాలి మన మధ్య లేక పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

 ఆయన ఒక మొరటు మనిషి, కానీ...

ఆయన ఒక మొరటు మనిషి, కానీ...

అన్నయ్య హరికృష్ణ ఒక మొరటు మనిషి.. కానీ మనసేమో వెన్నలాగా కరిగిపోయే తత్వం. అది ఆయనలో ఉన్న గొప్ప అలంకారం. నాన్న‌గారు తెలుగు దేశం పార్టీ స్థాపించిన‌ తొలి నాళ్లలో చేదోడువాదోడుగా ఉంటూ తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా రాష్ట్రంలో ఓ వికాసాన్ని ప్ర‌వ‌హింప‌జేసి, చైత‌న్య ర‌థసార‌థిగా ప‌నిచేశారు అంటూ... ఈ సభా ముఖంగా బాలయ్య నివాళులు అర్పించారు.

ఎన్నో మంచి పనులు

ఎన్నో మంచి పనులు

మా నాన్న‌గారి మ‌ర‌ణానంత‌రం అన్నయ్య ఉప ఎన్నిక‌ల్లో హిందూపూర్‍‌లో 60 వేల మెజారిటీతో గెలిచారు. ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఉపయోగకరంగా ఉండేలా ట్రాక్ట‌ర్ల‌కు రోడ్ ట్యాక్స్ రద్దు చేయడంతో పాటు మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో కండ‌క్ట‌ర్లుగా ఉపాధి క‌ల్పించారని బాలయ్య గుర్తు చేసుకున్నారు.

అరవింద సమేత గురించి

అరవింద సమేత గురించి

ప్రేక్షకులు మంచి సినిమాల‌ను చూసి ఆద‌రించి, అభినందిస్తున్నారు. య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్‌తో బిజీగా ఉండి ఈ సినిమా నేను ఇంకా చూడ‌లేక‌పోయా. కథ గురించి విన్నాను. పాలిచ్చే త‌ల్లులు పరిపాలించడం ఒక లెక్కా అని ఇందులో చెప్పారు. అపుడు నాకు లెజెండ్‌లో డైలాగ్ ‘"వినా: స్త్రీ యా: జననం నాస్తి... వినా: స్త్రీ యా: జీవం నాస్తి.. వినా: స్త్రీ యా: గమనం నాస్తి..వినా: స్త్రీ యా: సృష్టి దేవా నాస్తి". త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌ల్లో, కథల్లో ఎంతో చురుకుదనం, ప‌దునుత‌నం ఉంటుందని బాలయ్య అన్నారు.

ఆ సినిమాలంటే నందమూరి వంశమే

ఆ సినిమాలంటే నందమూరి వంశమే

చారిత్రాత్మ‌క సినిమాలు, పౌరాణిక సినిమాలకు నందమూరి వంశం పెట్టింది పేరు. నేను గౌతమీపుత్ర శాతకర్ణి చేశాను. తల్లిగొప్పదనం గురించి చెప్పిన సినిమా. అలా స్త్రీలను గౌరవించే సాంప్రదాయం మనది అని బాలయ్య వ్యాఖ్యానించారు.

వారసత్వాన్ని ముందుకు తీకెళ్లడం కత్తిమీద సాము

వారసత్వాన్ని ముందుకు తీకెళ్లడం కత్తిమీద సాము

ఎంతో మంది పుడతాం, ఎంతో మంది గిడతాం. అందరూ మహానుభావులు కాలేరు. ఒక బాధ్యత మన మీద ఉన్నపుడు దాన్ని మోయడం, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం కత్తికి రెండు వైపులా పదును లాంటిదని తెలిపారు.

అభిమానం హద్దు మీరొద్దు

అభిమానం హద్దు మీరొద్దు

నా అభిమానులు పద్దతిగా నడిచే సుశిక్షితులైన సైనికులు అని చెబుతుంటాను. అదే అభిమానం వేరు.. ఆత్మాభిమానంగా ఉండకూడదని సభా ముఖంగా తెలియజేస్తున్నాను. అవి రెండు వేర్వేరు. నేను జీవితాన్ని ఎంతో చూశా. స్ప‌ర్థ‌యా వ‌ర్ధ‌తే విద్య అని అంటాం. ఏ రంగంలోనైనా పోటీ అవసరమే, అప్పుడే ఫలితాలు బావుంటాయి. అయితే ఆ పోటీ ఆరోగ్యక‌రంగా ఉండాలి. ఇత‌రుల‌ను కించ ప‌ర‌చేలా, బాధ పెట్టేలా ఉండ‌కూడ‌దు. పూర్వ జ‌న్మ‌లో కొంత‌మందితో ఉన్న ప‌రిచ‌యంతో, ఈ జ‌న్మ‌లో ఒక‌రిద్ద‌రిని పొంద‌వ‌చ్చు. అభిమానం అనేది డ‌బ్బుతో కొన‌లేనిది. నా అభిమానుల‌తో నాకున్న అనుబంధం గొప్ప‌ది అని బాలయ్య వ్యాఖ్యానించారు.

నేను, తారక్ చేసే సినిమాలు ఎవరి వల్లా కావు

నేను, తారక్ చేసే సినిమాలు ఎవరి వల్లా కావు

నేను, తార‌క్ చేసే సినిమాలు చేయ‌డం ఎవరి వ‌ల్ల కావు. అలా చేయ‌డం అసాధ్యం. అవ‌న్నీ జీవితం క‌న్నా పెద్ద‌వి. పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు కండువా లేనిదే గడపైనా దాటని వాడు పంచభక్ష పరమాన్నంబు పళ్లెంనందు ఉంచినా గోంగూర పచ్చడికై ఎదురు చూచు వాడు ఎవరయ్యా ఇంకెడు మన తెలుగువాడు... అలా మా సినిమాల్లో న‌వ‌ర‌సాలూ ఉండాల‌ని కోరుకుంటారు ప్రేక్ష‌కదేవుళ్లు. అందుకే మా పాత్ర‌లు కూడా అలాగే ఉంటాయన్నారు.

నటీనటులు, టెక్నీషియన్లపై బాలయ్య ప్రశంలు

నటీనటులు, టెక్నీషియన్లపై బాలయ్య ప్రశంలు

ఈ సందర్భంగా బాలయ్య హీరోయిన్ పూజా హెగ్డే, నటుడు జగపతి బాబు, సంగీత దర్శకుడు తమన్ ఇతర నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలపై తనదైన శైలిలో ఉదాహరణలు చెబుతూ ప్రశంసల వర్షం గుప్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X