కరోనా బారిన పడ్డ నందమూరి బాలకృష్ణ..బహిరంగంగా యోగా... ఆందోళన వద్దంటూనే!

ప్రస్తుతం కరోనా కేసులు మళ్ళీ మొదలవుతున్నాయి. వీఐపీలు, సెలబెట్రీలే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. గత రెండుమూడు రోజులుగా తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. తనను కలిసి ప్రతి ఒక్కరూ టెస్ట్‌ చేసుకోవాలని ఆయన సూచనలు చేశారు. అంతేకాక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు.

త్వరలోనే కోలుకుని సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆయన యోగా దినోత్సవం రోజునే అందరితో కలిసి యోగాసనాలు వేశారు. ఇక నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో చేసిన అఖండ సినిమాతో మళ్లీ మంచి హిట్ అందుకున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Nandamuri Balakrishna tested corona positive

వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మీద ప్రస్తుతానికి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇందులో 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనితోపాటు ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ ప్రొగ్రామ్‌ సీజన్ 2కు వ్యాఖ్యతగా ఉన్నారు. ఇక బాలకృష్ణ కరోనా బారిన పడడంతో గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆయన షెడ్యూల్ అంతా మారిపోయే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X