మొబైల్ ఫోన్ విసిరి కొట్టిన బాలయ్య.. కరోనాకు వ్యాక్సిన్ రాదు.. నటసింహంలో అదే తీరు!
టాలీవుడ్‌లో కొండంత సహనంతో కనిపించే నందమూరి బాలకృష్ణ.. ఏదైనా తేడా జరిగితే అంతే మొత్తంలో అసహనం వ్యక్తం చేయడంలో ముందుంటాడు. ఒకరి కోసం కాకుండా తన మనసుకు నచ్చిన పని చేయడానికి ఆసక్తి చూపుతారనే విషయం ఎన్నో సందర్భాల్లో వ్యక్తమైంది. అయితే లాక్‌డౌన్ తర్వాత సినిమా ఫంక్షన్‌కు హాజరైన బాలకృష్ణ చాలా చలాకీగా కనిపించారు. సెహారీ సినిమా ఫంక్షన్‌లో సరదాగా చిత్ర యూనిట్‌ను ఆటపట్టిస్తూ హంగామా చేశారు. అయితే ఓ సందర్భంలో బాలకృష్ణ తన పాకెట్‌లోని ఫోన్ ఎందుకు విసిరి కొట్టారంటే..
Recommended Video

కార్తీక మాసం తొలి సోమవారం రోజున
కార్తీక మాసం సోమవారం లాంటి శుభదినం రోజున నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు నిర్మిస్తున్న సెహరి అనే సినిమా ఫంక్షన్‌కు హాజరయ్యారు. యువ హీరో, హీరోయిన్లు, నిర్మాత, డైరెక్టర్‌తో చాలా హుషారుగా కనిపించారు.

పాకెట్‌లో ఫోన్ మోగగానే..
సెహరీ సినిమా ఫస్ట్ లుక్ కోసం నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఆ సమయంలో తన పాకెట్‌లో ఉన్న ఫోన్ మోగింది. దాంతో చికాకు పడిన ఆయన ఫోన్ తీసి కాల్‌ను చూసి పక్కనే ఓ వైపు విసిరి కొట్టాడు. ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయాలనే మంచి మూడ్‌లో అలాంటి డిస్ట్రబెన్స్‌తో అసౌకర్యంగా భావించిన భాలయ్య ఫోన్ తన అసిస్టెంట్ వైపు విసిరివేసినట్టు సమాచారం.

యువ హీరో, హీరోయిన్లతో చలాకీగా
ఇక యువ హీరోయిన్ సిమ్రాన్‌తో కూడా చలాకీగా ఉంటూ బాలయ్య అలరించాడు. యంగ్ టీమ్ కనిపించగానే బాలయ్యలో ఓ కొత్త ఉత్సాహం ఉరకలేసినట్టు కనిపించింది. అలాగే ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన తర్వాత హీరో హర్షను పోస్టర్ ముట్టుకోవద్దు స్వీట్ వార్నింగ్ ఇస్తూ కనిపించారు. అలా సరదాగా వేదిక మీద అందరితో హడావిడిగా ఉంటూ కనిపించారు.

కరోనాకు వ్యాక్సిన్ రాదు.. అంటూ
ఇక సెహరీ ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన తర్వాత బాలయ్య మాట్లాడుతూ.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ రాదు.. ఇక జాగ్రత్తగా ఉండటమే మంచిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఫంక్షన్లకు హాజరయ్యే కొందరు ప్రముఖులు కొబ్బరికాయ కొట్టి నష్టం జరుగాలని కోరుకొంటారు అంటూ బాలయ్య ఘాటైన కామెంట్లు చేశారు.


Click it and Unblock the Notifications











