మౌనదీక్షకు దిగుతున్న నందమూరి హీరో.. భారీ ర్యాలీ కూడా.. ఎందుకో తెలుసా?

కొద్ది రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ కనిపించడం లేదని హిందూపురంలో పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మౌనదీక్షకు దిగుతున్న సంగతి సంచలనంగా మారుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

13 కొత్త జిల్లాలు

13 కొత్త జిల్లాలు

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాల రగడ ముదురుతోంది. 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోండగా ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు వచ్చి చేరుతున్నాయి.

 హిందూపురం కేంద్రంగా

హిందూపురం కేంద్రంగా

పార్లమెంట్ పరిధినే నియోజకవర్గాల ఆధారంగా జగన్ సర్కార్ జిల్లాల విభజన చేపట్టింది. అయితే మరీముఖ్యంగా దీనిని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లాలో నిరసనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని రోడ్డెక్కారు.

హిందూపురం కేంద్రంగా

హిందూపురం కేంద్రంగా

అయితే.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ల్లో ఏ ఒక్క‌రూ కూడా స్పందించ‌డం లేదని చెబుతూ నిర‌స‌నకారులు స్థానిక వన్‌టౌన్ పోలీసు సేష్ట‌న్ లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ లు క‌న‌బ‌డ‌టం లేద‌ని ఫిర్యాదు చేశారు. అయితే వారు ఫిర్యాదు చేసేప్పటికే సత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలని బాలయ్య వీడియో విడుదల చేసి డిమాండ్ చేశారు.

భారీ ర్యాలీ

భారీ ర్యాలీ

హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు. హిందూపురం వ్యాపార, వాణిజ్య పరంగా.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిదని అన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో హిందూపురం జిల్లా కోసం బాలయ్య ఉద్యమించనున్నారు. హిందూపురం నియోజకవర్గంకి బాలయ్య చేరుకున్నారు. రెండు రోజుల పాటు హిందూపురంలో పర్యటించనున్నారు. హిందూపురం జిల్లా కోసం శుక్రవారం నాడు భారీ ర్యాలీ చేపట్టనున్నారు.

భారీ ర్యాలీ

భారీ ర్యాలీ


అనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేయనున్నారు. హిందూపురం జిల్లా కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌనదీక్షకు దిగనున్నారు. ర్యాలీ అనంతరం అఖిలపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్న బాలకృష్ణ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వస్తున్న క్రమంలో ఈ అంశాన్ని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి. ఇక మరో పక్క బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.

Recommended Video

Nandamuri Balakrishna With His Family At Pushpa Movie Special Screening | Filmibeat Telugu
అఖండ సినిమాతో

అఖండ సినిమాతో

చివరిగా అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఆ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X