twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    525 రోజులు ఏకధాటిగా ఆడిన రికార్డు.. చారిత్రాత్మకంగా సినిమా థియేటర్.. తారకరామ రీ లాంచ్‌లో బాలకృష్ణ ఎమోషనల్

    |

    హైదరాబాద్‌ నగరంలో తలమానికంగా నిలిచిన సినిమా థియేటర్లలో కాచిగూడలోని తారకరామ థియేటర్ ఒకటి. అందులో ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రదర్శించారు. పలు సినిమాలు ఈ థియేటర్లలో ప్రదర్శించబడి బాక్సాఫీస్ వద్ద మైలురాళ్లుగా నిలిచాయి. అలాంటి తారకరామ థియేటర్‌ ఈ జనరేషన్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మలిచి పున: ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..

    కారణ‌జన్ముడు ఎన్టీఆర్

    కారణ‌జన్ముడు ఎన్టీఆర్

    నాకు ధన్యమైన జన్మనిచ్చి.. మీ అందరి గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవడానికి కారణమైన కారణ జన్ముడు, దైవాంశ సంభూతుడు నందమూరి తారకరామరావుకు ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. నాకు ఆయన గురువు, దైవం లాంటి వారు. ఈ రోజు చరిత్ర కలిగిన తారకరామ థియేటర్ రీ ఓపెనింగ్ జరిగింది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొన్న చారిత్రాత్మకమైనదిగా మారింది. ఆయన ప్రతి విషయంలో దూరదృష్టి ఉంటుంది అని నందమూరి బాలకృష్ణ అన్నారు.

    కళామతల్లి కళకళలాడింది అంటూ ఎమోషన్

    కళామతల్లి కళకళలాడింది అంటూ ఎమోషన్


    ఎన్టీఆర్ నటిస్తే.. జానపదాలు జావలీలలు పాడాయి. పౌరాణికాలు ప్రాణాలు పోసుకొన్నాయి. సాంఘీక నేపథ్యమున్న చిత్రాలు సామజవరగమనలు పాడాయి. అలాగే పద్యం పదునెక్కింది. కళామతల్లి కళకళలాడింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఆయన లాంటి నటధీరుడు, ప్రయోగాలు చేసిన నటుడు, పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పాత్రలకు ప్రాణం పోసిన నటధీరుడు నందమూరి తారకరామరావు అని బాలకృష్ణ అన్నారు.

    పర్యాటక కేంద్రంగా ఎన్టీఆర్ ఎస్టేట్

    పర్యాటక కేంద్రంగా ఎన్టీఆర్ ఎస్టేట్


    తెలుగు జాతి కీర్తిని నలుదిశలా చాటిన నటుడు, రాజకీయవేత్త ఎన్టీఆర్. చెన్నైలో ఉన్న సమయంలోనే హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఎస్టేట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో చారిత్రాత్మక ప్రదేశాలతోపాటు చూడదగిన పర్యాటక కేంద్రంగా ఎన్టీఆర్ ఎస్టేట్ మారింది. హైదరాబాద్ పర్యటనకు వచ్చే వారు ఎన్టీఆర్ ఎస్టేట్ చూపించమనే స్థాయికి ఆ వేదిక ఎదిగింది. తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం కోసం లలితా కళాతోరణాన్ని కట్టారు అని బాలకృష్ణ చెప్పారు.

    525 రోజులు ఆడిన సినిమా

    525 రోజులు ఆడిన సినిమా


    తారకరామ థియేటర్‌కు ఒక చరిత్ర ఉంది. నాన్నగారి పేరు కలిసి వచ్చేటట్టు నిర్మించిన థియేటర్. మేము, అభిమానులందరూ ఒక దేవాలయంగా భావిస్తారు. ఈ సినిమా థియేటర్‌ను 1971లో నిర్మించారు. ఈ థియేటర్‌లో అక్బర్ సలీం అనార్కలి సినిమాను రిలీజ్ చేసి ప్రారంభించారు. ఆ చిత్రం అక్బర్‌గా ఎన్టీఆర్, సలీంగా నేను నటించాను. 1995లో మళ్లీ రెనోవేషన్ చేశాం. ఈ థియేటర్‌ను హంగులు అద్దడం ఇది మూడోసారి. ఈ థియేటర్‌లో డాన్ చిత్రం 525 రోజులు ఆడింది. నేను నటించిన మంగమ్మ గారి మనవడు, ముద్దుల మామయ్య, ముద్దుల కృష్ణయ్య లాంటి చిత్రాలు భీకరంగా నడిచాయి అని బాలకృష్ణ తెలిపారు.

    నాన్నగారితో ఏషియన్ ఫిలింస్ అధినేతకు..

    నాన్నగారితో ఏషియన్ ఫిలింస్ అధినేతకు..

    ఏషియన్ ఫిలిం సునీల్ నారంగ్ గారి నాన్నగారు నారాయణదాస్ నారంగ్ గారు ఇటీవలే మరణించారు. ఆయనకు నాన్నగారికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ పరంపరను ముందుకు తీసుకెళ్లడానికి ఈ ప్రయత్నం అభినందనీయం. నారంగ్, మేము కుటుంబ సభ్యులం. వారి పర్యవేక్షణలో ఈ థియేటర్‌లో ప్రదర్శనలు కొనసాగడం చాలా ఆనందంగా ఉంది అని బాలకృష్ణ అన్నారు.

    English summary
    Tollywood Star and MLA Nandamuri Balakrishna to re launch Asian Tarakarama Theatre in Kachiguda of Hyderabad. In this occassion, He recollected the olden days of NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X