ఫ్యాన్స్ కోసం బాలయ్య..

By Staff

Balakrishna
తను ఎప్పుడు వస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులను ఆనందపరిచేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..పదమూడేళ్ళ క్రితం మహబూబ్‌నగర్‌జిల్లా ఎన్టీఆర్‌ అభిమానసంఘం అధ్యక్షుడు బాలప్ప, ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి, కొల్లాపూర్‌ నియోజకవర్గ కోర్‌ కమిటీ నేత హర్షవర్దన్‌ రెడ్డి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తయారుచేయించారు.అయితే అప్పట్లో కొల్లాపూర్‌లో విగ్రహాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు.

దీంతో అభిమానులంతా కలిసి హైకోర్టు కెళ్లి మూడేళ్లపాటు పోరాడి ఫర్మిషన్ తెచ్చుకున్నారు. అయితే విగ్రహావిష్కరణకు బాలకృష్ణే రావాలంటూ పట్టుపట్టారు. ఆయన వస్తేనే ఆవిష్కరణ అంటూ ఎదురు చూసారు. కానీ కాలం కలసి రాదేదు. అయితే బాలయ్య ఇప్పుడా ఆవిష్కరణ చేయటానికి సమ్మతించారు. నిజానికి ఆయన ప్రస్తుతం చేస్తున్న యాత్రలో భాగంగా ఈ కార్యక్రమం ఉండాలి. నాలుగోతేదీన మహబూబ్‌నగర్‌ జిల్లాలో బాలకృష్ణ పర్యటనఉన్నా...ఆయన యాత్ర మార్గం కొల్లాపూర్‌ మీదుగా లేకుండా పోయింది.

దాంతో కొందరు జిల్లా నాయకుల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడిందంటూ అభిమానులు ఆగ్రహంతో, నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య వారికోసం ప్రత్యేకంగా ఒక రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు..ఇదే విషయాన్ని వారంతా కలిసి బాలయ్యకు నివేదించారు. దీంతో బాలకృష్ణ ఈ నెలాఖరులో విగ్రహావిష్కరణకు వస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటన విషయాన్ని బాలయ్య పర్యటనను పర్యవేక్షిస్తున్న కంభంపాటి రామ్మోహన్‌రావు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X