CBN Arrest జగన్ 16 నెలలు జైల్లో.. 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలని ఆశ.. విజయవాడకు బాలకృష్ణ
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజయవాడకు బయలు దేరారు. ఇప్పటికే నారా లోకేష్, భువనేశ్వరి విజయవాడకు చేరుకొని చంద్రబాబును కలుసుకొన్న విషయం తెలిసిందే. అయితే తన కుటుంబానికి అండగా ఉండేందుకు బాలకృష్ణ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు వెళ్తూ మీడియాతో మాట్లాడుతూ..
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఇంతకు ముందే ఈ కేసులో కోర్టుకు వెళితే ఏపీ ప్రభుత్వానికి న్యాయమూర్తి మొట్టికాయలు వేశారు. ఇన్నాళ్లు చార్జిషిట్ వేయకుండా కాలయాపన చేశారు. ప్రస్తుతం హడావిడిగా అరెస్ట్‌కు పాల్పడ్డారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నానని.. చంద్రబాబును కనీసం 16 నిమిషాలు జైల్లో పెట్టాలనే తాపత్రయం తప్ప మరోటి కనిపించలేదు అని బాలకృష్ణ అన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో హిందూపురంలో కూడా క్యాంప్ నిర్వహించాం. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అందులో అవినీతి ఏముంటుంది. ఎమ్మెల్యేగా నేను కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించాను అని బాలకృష్ణ తెలిపారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనే కారణంతో అందర్నీ అడ్డుకొంటున్నారు. నన్ను ఎవరు ఆపలేదు. నేను ఫ్యామిలీ మెంబర్స్‌ను. నన్ను ఎందుకు ఆపుతారు అని బాలకృష్ణ అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ కల్యాణ్‌తో నేను మాట్లాడాను. మా భాగస్వాములతో కూడా చర్చించాం. పవన్ కల్యాణ్‌ను విజయవాడకు రాకుండా అడ్డుకొన్నారనే విషయం తెలిసింది. ఇలాంటి అడ్డంకులతో ఏమీ చేయలేరు అని బాలకృష్ణ చెప్పారు.


Click it and Unblock the Notifications











