సోదరి మృతితో బాధలో ఉన్న బాలకృష్ణ.. సెల్ఫీ అడిగిన ఫ్యాన్.. ఊహించని రియాక్షన్!

ఇటీవల నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలచివేసిందే. ఇక సోదరి మృతి పట్ల నందమూరి బాలకృష్ణ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే సోదరి ఆఖరి చూపు చూసుకోవడానికి ఇటీవల ఆమె స్వగృహానికి వెళ్లగా అక్కడ ఒక చేదు అనుభవం ఏర్పడింది. ఒక అభిమాని హఠాత్తుగా వచ్చి సెల్ఫీ అడిగేసరికి బాలయ్య ఊహించని రియాక్షన్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 నందమూరి ఫ్యామిలీలో న్విషాదఛాయలు

నందమూరి ఫ్యామిలీలో న్విషాదఛాయలు

సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి మృతి చెందడంతో నందమూరి ఫ్యామిలీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. వారి కుటుంబంలో ఒకవైపు బింబిసారా సినిమాతో కళ్యాణ్ రామ్ పండగ వాతావరణం క్రియేట్ చేయగా ఇదే తరుణంలో ఆ ఇంటి ఆడపిల్ల తనువు చాలించడం అందరికీ ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. నందమూరి హీరోలు అందరూ కూడా ఉమామహేశ్వరి మృతి పట్ల కన్నీటి పర్యంతమయ్యారు.

ఆత్మహత్య?

ఆత్మహత్య?

ఉమామహేశ్వరి ఆరోగ్య సమస్యల వలన అలాగే ఒత్తిడి వలన బాధను తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా వారి సన్నిహితులు తెలియజేశారు. ఇక ఈ మృతిపై పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో పెద్దదైన నందమూరి ఫ్యామిలీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

 ఇటీవలే పెళ్లి వేడుక

ఇటీవలే పెళ్లి వేడుక


నిజానికి ఉమామహేశ్వరి బయట ప్రపంచంలో పెద్దగా కనిపించేవారు కాదు. చాలా కాలంగా అమెరికాలోనే తన ఫ్యామిలీతో ఉన్న ఆమె ఆ తర్వాత కూతుర్ల పెళ్లిళ్ల కోసం ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. ఇక ఇద్దరి కూతుర్ల పెళ్లి కూడా ఆమె ఘనంగా నిర్వహించారు. ఇటీవల రెండవ కుమార్తె పెళ్లి వేడుకకు కూడా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు.

 బాలయ్య కంటతడి

బాలయ్య కంటతడి

ఇక నందమూరి బాలకృష్ణ కూడా ఉమామహేశ్వరికి ప్రతి విషయంలో కూడా అండగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మేనకోడలు పెళ్లిలో కూడా ఆయనే ఎంతో హడావిడిగా కనిపించినట్లు సమాచారం. అయితే ఈ తరుణంలో ఉమామహేశ్వరి ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. సోదరి ఆఖరి చూపుల సమయంలో ఆయన కంటతడి పెట్టుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు.

 బాధలో ఉండగా సెల్ఫీ

బాధలో ఉండగా సెల్ఫీ

అయితే సోదరీ మృతితో తీవ్ర మనోవేదనకు గురైన బాలయ్య ఉమామహేశ్వరి ఇంటి ముందు మీడియా ఉన్నప్పటికీ కూడా పెద్దగా రియాక్షన్ ఇవ్వలేదు. అయితే ఇంతలో హఠాత్తుగా ఒక అభిమాని చేసిన ప్రవర్తించిన తీరుకు అక్కడ అందరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. హఠాత్తుగా జనాల్లో నుంచి వచ్చి ఒక సెల్ఫీ కావాలని అడిగాడు.

బాలయ్య సైలెంట్ రియాక్షన్

బాలయ్య సైలెంట్ రియాక్షన్


బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో మాట్లాడి కారు ఎక్కుతుండగా జనంలో నుంచి వచ్చిన ఓ అభిమాని అలా సెల్ఫీ అడగగానే నందమూరి బాలకృష్ణ ఏమి అనలేకపోయారు. ఒక సెకండ్ అలా సైలెంట్ గా చూసి కారు ఎక్కి వెళ్లిపోయారు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ విధంగా సెల్ఫీ అడగడం కరెక్ట్ కాదు అని, కొన్నిసార్లు అభిమానులు ఏ విధంగా ప్రవర్తిస్తారో కూడా అర్థం కావడం లేదని.. మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X