twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    20 ఏళ్ల మైల్ స్టోన్.. లోగో ఆవిష్కరించిన బాలకృష్ణ

    |

    నందమూరి బాలకృష్ణ సేవా కార్యక్రమాలు కంటికి ఎక్కువగా కనిపించవు. ప్రచారాల్లో ఎక్కడా వినిపించవు. చేసేదేదో చేస్తూనే ఉంటాడు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. ఎంతో మంది ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు బాలయ్య. సహృదయంతో మొదలు పెట్టిన ఈ మంచి కార్యక్రమానికి ఇరవై యేళ్లు నిండాయి. ఈ సందర్భంగా లోగోను ఆవిష్కరించారు.

    జూన్ 22, 2000వ సంవత్సరంలో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం కాగా ఇంకో రెండు రోజుల్లో ఇరవై యేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. 'ఈ రోజు నేను, నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ట్రస్ట్ మెంబర్స్ అయిన జేఎస్ఆర్ ప్రసాద్, మతుకుమిలి భరత్ ఇరవై యేళ్లు అవుతున్న సందర్భంగా లోగోను ఆవిష్కరించాం.

    Nandamuri Balakrishna Unveiled 20 years of excellence in cancer care

    ఈ హాస్పటల్ నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఇది మా అందరికి గుర్తిండిపోయే మైల్ స్టోన్'అని బాలయ్య పోస్ట్ చేశాడు. ప్రతి ఏడాది బాలయ్య తన పుట్టిన రోజు వేడుకలను ఈ హాస్పిటల్‌లోనే జరుపుకుంటాడు. నందమూరి తారక రామారావు, బసవ తారకం విగ్రహాలకు నమస్కరించి.. చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటాడు.

    English summary
    Nandamuri Balakrishna Unveiled 20 years of excellence in cancer care. '20 years of excellence in cancer care' Nandamuri Basavataraka Rama rao memorial foundation completed 20 years and the new logo unveiled today
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X