Tirumala: బాలకృష్ణ కోసం 664 కొబ్బరి కాయలు కొట్టి.. తిరుమలలో 5 కిలోల కర్పూరంతో ఫ్యాన్స్ బర్త్ డే వేడుకలు
సినీ నటుల కోసం అభిమానులు పూజలు చేయడం.. వారికి మంచి జరిగితే మొక్కులు చెల్లించుకోవడం ఎన్టీఆర్ నుంచి నేటితరం హీరోల వరకు వస్తూనే ఉంది. సినీ నటులను తమ దైవంగా భావించే ఫ్యాన్స్ వారి కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉంటారు. అలాంటి విషయాన్ని ఇటీవలే నందమూరి బాలకృష్ణ అభిమానులు ప్రూవ్ చేశారు. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించి వారు తమ నిలువెత్తు అభిమానాన్ని చాటుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మూడోసారి విజయంతో హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ జన్మదినం జనవరి 10వ తేది. ఆయన తన పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకొన్నారు. హిందూపురంలో తన అభిమానులు, కార్యకర్తలు, నేతలతో కలిసి పుట్టిన రోజును జరుపుకొంటూ స్థానిక దేవాలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకొన్నారు.

బాలయ్య ఇలా చేస్తే.. తిరుమలలో ఆయన అభిమానులు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో అఖిలాండం వద్ద 664 కొబ్బరికాయలు కొట్టి తన అభిమాన హీరో శ్రేయస్సును, ఆయురారోగ్యాలను కోరుకొన్నారు. అలాగే 5 కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవలో చిరకాలం ఉండాలని ఆకాక్షించారు. ఈ వేడుకలు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఎన్టీఆర్ రాజు ఆయన కుటుంబ సభ్యులు పర్యవేక్షణలో జరిగింది.
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ... ఎన్టీఆర్ రాజు కొడుకుగా నందమూరి అభిమానిగా నాకు చాలా గౌరవం లభించింది. బాలయ్య జన్మదిన సందర్భంగా మా కుటుంబం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని అన్నారు.

నందమూరి బాలకృష్ణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలి. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ సేవా కార్యక్రమాలు చేయాలి. ఏ పని చేసినా విజయవంతం కావాలని ఆ శ్రీవారిని కోరుకుంటున్నాను, ఆయన పుట్టినరోజు మాకు ఒక పండగ లాంటిది అని శ్రీధర్ వర్మ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











