Balakrishna: రేవంత్‌రెడ్డిని కలిసిన బాలకృష్ణ.. ఆ విషయాలపైనే చర్చ!
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున దంపతులు.. ఇలా ప్రముఖులు అందరూ సీఎం రేవంత్ ను కలిసి విషెష్ చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు సైతం వెంటనే వైరల్ అవుతున్నాయి. తాజాగా నటసింహం నందమూరి బాలయ్య.. రేవంత్ రెడ్డిని కలిశారు. బాలయ్య తన అల్లుడితో కలిసి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ వివరాల్లోకి వెళితే...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి.. తన బాధ్యతలను చేపట్టాడు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యి 20 రోజులు దాటినా.. ఆయనకు సినీ ప్రముఖుల నుంచి విషెష్ అందుతున్నాయి. ఇక ఆయనకు ముఖ్యమంత్రిగా ఎన్నిక అయినందుకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిసి విషెష్ చెబుతున్నారు.

ఇటీవల మర్యాదపూర్వకంగా మెగాస్టార్ చిరంజీవి.. రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక ఈరోజు ఉదయం నాగార్జున ఫ్యామిలీ కలిసింది. తన భార్య అమలతో కలిసి నాగార్జున.. ముఖ్యమంత్రిని కలిశారు. పుష్ప గుచ్చం ఇచ్చి కాసేపు మర్యాదపూర్వకంగా మాట్లాడారు. వీరి మధ్య సినిమా ఇండస్ట్రీతోపాటు బిగ్ బాస్ వ్యవహారం, ఇతర వ్యక్తిగత విషయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
ఇక తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్యాంప్ ఆఫీసులో కలిసి బాలయ్య ప్రత్యేక అభినందలు తెలిపారు. బాలకృష్ణతోపాటు ఆయన అల్లుడు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు, నాయకులు కూడా హాజరు అయ్యారు. ఇక ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి కొన్నాళ్లపాటు సేవలు అందించారు కూడా. ఆ సమయంలో బాలకృష్ణతో రేవంత్‌రెడ్డికి మంచి అనుబంధం ఉండగా... ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు కలవడం చర్చనీయాంశం అయింది. ప్రభుత్వం మారినప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిని, సీఎంని కలవడం సహజమే. అందులో భాగమే ఇదంతా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని బాలయ్య మీట్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా బాలయ్య విషయానికి వస్తే... ఈ ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.


Click it and Unblock the Notifications











