ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నందమూరి హీరో వార్నింగ్: చంద్రబాబు, బాలయ్యను లాగుతూ.. బొ* కూడా పీకలేరంటూ!
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం నందమూరి తారక రామారావు అన్న విషయం తెలిసిందే. ఆయన తర్వాత తరంలో బాలకృష్ణ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. ఆ తర్వాత చాలా మంది హీరోలుగా పరిచయం అయినా.. అంతగా సక్సెస్ కాలేకపోయారు. అందులో చైతన్య కృష్ణ ఒకరు. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే అతడు.. తాజాగా ఎన్టీఆర్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు. అసలేమైందో మీరే చూసేయండి!
వరుస హిట్లతో ఫుల్ ఫామ్:నందమూరి ఫ్యామిలీ నుంచి బడా స్టార్‌గా ఎదిగిన హీరోనే జూనియర్ ఎన్టీఆర్. అన్ని విభాగాల్లోనూ మెప్పించే అతడు.. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో RRRతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. అలా ఇప్పుడు 'దేవర', 'వార్ 2' మూవీలు చేస్తున్నాడు.

ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా:వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేడు. కానీ, అతడి పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు బాగా హైలైట్ అయింది. అయితే, అతడి పేరును సొంత తెలుగుదేశం నాయకుల కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు బాగా వాడుకున్నారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై ఫైర్:ఈ మధ్యనే జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీని కాదని వైసీపీని సపోర్ట్ చేసినట్లు ఓ టాక్ హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది నందమూరి ఫ్యామిలీలో కలకలం రేపినట్లు అయింది. అందుకే తాజాగా దీనిపై నందమూరి చైతన్య కృష్ణ స్పందించాడు. అంతేకాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

బొ* కూడా పీకలేరంటూ:తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో నందమూరి చైతన్య కృష్ణ ఓ వివాదాస్పద పోస్ట్ చేశాడు. అందులో 'జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నా వార్నింగ్. ఎవరైతే గత ఎన్నికల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీకి సపోర్ట్ చేశారో వాళ్లకు మాత్రమే. మీరు నిజంగా వాళ్లకు సపోర్ట్ చేశారని అంటున్నారు. కానీ, మీరెవరూ మా బొచ్చు కూడా పీకలేరు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

టచ్ కూడా చేయలేరు:ఇదే పోస్టులో నందమూరి చైతన్య కృష్ణ 'నేను ఉండగా చంద్రబాబు నాయుడు మావయ్య, నందమూరి బాలకృష్ణ బాబాయిని టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లతో కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు. మీ అందరికీ చెబుతున్నా జాగ్రత్తగా ఉండండి' అంటూ అభిమానులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

ఫ్యామిలీలో కలకలం:తాజాగా ఫేస్‌బుక్ ఖాతాలో నందమూరి చైతన్య కృష్ణ చేసిన పోస్టు అటు సినిమా రంగంతో పాటు ఇటు రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా దీనివల్ల నందమూరి కుటుంబ అభిమానులు రెండుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే వీళ్లలో చాలా మంది చైతన్య కృష్ణ తాజాగా చేసిన పోస్టుపై పాజిటివ్‌గా, మరికొందరు నెగెటివ్‌గా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











