నందమూరి హీరోలు భార్యలను ఎప్పుడూ...
రామ్ చరణ్ తన కాబోయే భార్య ఉపాసనతో మీడియోలో ఎడా పెడా కనపడుతూండటంతో అదో హాట్ టాపిక్ గా మారింది. నందమూరి హీరోలు ఎవరూ ఇలా తమ బార్యలను ఇలా బయటకు ఎక్సపోజ్ చేయలేదని చెప్పుకుంటున్నారు. అంతేగాక మహేష్ బాబు భార్య నమ్రత కూడా పబ్లిక్ ఫంక్షన్స్ కు హాజరవుతుంది కానీ నందమూరి ఫ్యామిలీలు అలాకాదు అంటున్నారు. బాలకృష్ణ గానీ, రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ గానీ ఇలా తమ బార్యలను బయిటకు తీసుకురావటం, పదే పదే మీడియోలో కనపడేలా చేయటం జరగలేదని చర్చించుకుని పోలిక తెస్తున్నారు. దానికి ఉదాహరణగా ఊసరవిల్లి ఆడియో ఫంక్షన్ ని ఉదహరిస్తున్నారు. ఆ పంక్షన్ లో ఎక్కడా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కనపడలేదని గుర్తు చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ తన పెళ్ళి విషయమై మాట్లాడుతూ.. రైట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నామా లేదా అనేది కాదు...రైట్ పర్శన్ ని చేసుకుంటున్నామా అనేది ఆలోచించుకోవాలి అన్నారు రామ్ చరణ్.
మీరు త్వరగా పెళ్ళి చేసుకుంటున్నానని భావిస్తున్నారా అని మీడియా వారు ప్రశ్నిస్తే ఆయన ఇలా స్పందించారు. అలాగే కెరీర్ లో సెటిల్ కాని వారు పెళ్లి గురించి ఆలోచించరు. కానీ నేను రాబోయే ఇరవై ఏళ్ళ వరకూ నా కెరీర్ బావుంటుందనే భాటవిస్తున్నాను.ప్రస్తుతం నేను చాలా ఫోకస్ గా ఉన్నాను. ఇదే నా జీవితంలో నేను వివాహం చేసుకోవటానికి సరైన సమయం అని భావిస్తన్నాను అన్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.


Click it and Unblock the Notifications