నందమూరి మేళా, జూ ఎన్టీఆర్ రాకపై సందేహం?
హైదరాబాద్ : నందమూరి అభిమానులకు శుభవార్త. త్వరలో నందమూరి కుటుంబీకుల మేళా జరుగబోతోంది. అంతా ఒకే చోట అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న 'ఓమ్' చిత్రం ఆడియో వేడుక ఇందుకు వేదిక కానుందని తెలుస్తోంది. త్వరలో ఆడియో వేడుకకు డేట్ ఫిక్స్ కానుంది.
ఈ వేడుకకు చంద్రబాబు తో పాటు, బాలకృష్ణ, నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజరు కానుందే. అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఆయన హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. హాజరయితే ఓకే...కానీ కాక పోతే మాత్రం నందమరి కుటుంబంలోని లుకలుకలు మీడియాలో హాట్ టాపిక్ కానున్నాయి.
సినిమా వివరాల్లోకి వెళితే...వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న హీరో కళ్యాన్ రామ్ 'ఓం' చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. 3డి ఫార్మాట్లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ సరసన నికీషా పటేల్, కృతి కర్భంధ హీరోయిన్లుగా చేస్తున్నారు.

ఈ సినిమాకి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విదేశాల్లో పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందించే పనిలో ఉన్నామని ఆయన చెప్తున్నారు.
ఇక సునీల్ రెడ్డి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రసూల్ ఎల్లోర్ శిష్యుడు. ఆయన వద్ద భగీరధ, ఒకరికి ఒకరు చిత్రాలకు పనిచేసారు. ఆయన మంచు మనోజ్ తో చేసిన నేను మీకు తెలుసా చిత్రం బాగా పేరు తెచ్చుకుంది. నందమూరి అభిమానులు ఆశించే అన్ని అంశాలతో పాటు, సాంకేతిక విభాగానికీ ప్రాధాన్యం ఇస్తూ 'ఓం' చిత్రాన్నినిర్మాస్తున్నారు. ఇంతకు ముందు తన భ్యానర్ లో కళ్యాణ్ రామ్ అతనొక్కడే, హరేరామ్, జయీభవ చిత్రాలు నిర్మించారు. కత్తి చిత్రం ప్లాపు కావడంతో.... ఈ చిత్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











