»   » బళ్లారి బాలయ్య.. చాలా రేర్ పీస్.. తల్లిని మించిన అభిమానం.. ఎన్టీఆర్ మరణించినపుడు

బళ్లారి బాలయ్య.. చాలా రేర్ పీస్.. తల్లిని మించిన అభిమానం.. ఎన్టీఆర్ మరణించినపుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటులు అంటే ఎనలేని అభిమానం ప్రదర్శిస్తుంటారు కొందరు. వారి అభిమానం కొన్నిసార్లు హద్దులు దాటుతుంది. తన అభిమాన నటుడే సర్వస్వం, జీవితం అని భావించే వాళ్లు కోకొల్లలు. ఇలాంటి వీరాభిమానుల్లో ఒకరు బల్లారికి చెందిన వెంకటేశ్ ఒకరు. సినిమా నటులంటే ఈయనకే ఒక్కరికే కాదు .. ఇంట్లో వారందికీ ఓ రకమైన పిచ్చి. అభిమానం. వెంకటేశ్ కుటుంబంలో మూడు తరాల వారు నందమూరి కుటుంబానికి అభిమానులు. తరతరాలు నందమూరి కుటుంబాన్ని పూజిస్తున్న బళ్లారికి చెందిన ఈ కుటుంబం ఆ ప్రాంతం వారికి అందరికీ సుపరిచితులు. ఈ కుటుంబంపై బళ్లారిలో ప్రత్యేకమైన అభిమానం కురిపించడం విశేషం. బళ్లారి అంటే సహజంగా మైన్ ల్యాండ్స్ పేలుతుంటాయి. ఆ శబ్దాలకు మించి ఇప్పుడు వెంకటేష్ అభిమానం ఆ ప్రాంతంలో సంచలనం రేపుతున్నది..

నందమూరిని నూరిపోసిన తల్లి..

నందమూరిని నూరిపోసిన తల్లి..

తెలుగు చిత్ర పరిశ్రమలో నట విశ్వరూపం ప్రదర్శించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఇష్టపడని తెలుగు వారు ఉండరు. అయితే తెలుగు గడ్డపై పుట్టుకపోయినా ఎన్టీఆర్‌ను గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నది కర్ణాటకకు చెందిన మలియమ్మ కుటుంబం. ఈమె ఇంటి నిండా ఎన్టీఆర్, బాలయ్య చిత్ర పటాలే. ఉదయాన్ని ఈ పటాలకు పూజ చేయందే రోజు ప్రారంభం కాదు. తన పిల్లలకు కూడా మలియమ్మ నందమూరి అభిమానాన్ని చిన్నతనం నుంచే నూరిపోసింది.

మూడు తరాల అభిమానం..

మూడు తరాల అభిమానం..

మలియమ్మ (76) మిల్లర్ పేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద నివాసం ఉంటున్నది. చిన్ననాటి నుంచే ఎన్టీఆర్ అంటే చెప్పలేనంత అభిమానాన్ని పెంచుకొన్నారు. కుమారులు, మనవళ్లు, మనవరాళ్లకు తన అభిమానాన్ని నూరిపోసింది. అలా మూడు తరాల వారు నందమూరి హీరోలను దైవంగా కొలుస్తున్నారు. ఏ కష్టమొచ్చిన నందమూరి హీరోలకు మొక్కుకోవడం వారి ఆచారం. ఏ పని చేయాలన్నా ముందుగా దేవుడి పటాలకు బదులు ఎన్టీఆర్, బాలయ్య చిత్ర పటాలకు మొక్కుకుంటారట.

ఎన్టీఆర్ మరణించినపుడు

ఎన్టీఆర్ మరణించినపుడు

ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన చనిపోయినప్పుడు 11 రోజులు పోయ్యి వెలిగించలేదు. ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయలేదట. మా ఇంట్లో ఇతర దేవుళ్ల ఫోటోలు ఉండవు. ఎన్టీఆర్‌కే రోజు పూజచేస్తాం. ఇంతటి అభిమానాన్ని ప్రదర్శించే మలియమ్మ కుటుంబం బళ్లారిలో కూరగాయల దుకాణాన్ని నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నది.

తల్లిని మించిన అభిమానం

తల్లిని మించిన అభిమానం

మలియమ్మకు వెంకటేష్ అనే కుమారుడు ఉన్నాడు. నందమూరి ఫ్యామిలీకి ఈయన కూడా అమ్మను మించిన వీరాభిమాని. తన కుమారుడికి వెంకటేష్ అని పేరు పెట్టినప్పటికీ.. ప్రస్తుతం ఆయనను బళ్లారి బాలయ్యగా మార్చేసింది. మలియమ్మతోనే నందమూరి అభిమానం అంతమవుతున్నుకున్న వారికి ఆమె షాక్ ఇచ్చింది.

సినిమా రిలీజ్ అయితే..

సినిమా రిలీజ్ అయితే..

ఎన్టీఆర్ తర్వాత ప్రస్తుతం బాలకృష్ణకు ఈ ఫ్యామిలీ వీరాభిమానులు. బాలయ్య సినిమా రిలీజ్ అయితే కనీసం రూ.30 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తాడు. ఏ సినిమాలోనైనా బాలయ్య ఎలాంటి దుస్తులు వేసుకొంటే తన బీరువాలో ఆ క్యాస్టూమ్స్ ఉండాల్సిందే. కేవలం బట్టలే కాదు ఉంగరాలు, కళ్లజోళ్లు, బాలయ్య వినియోగించే వస్తువులు తన ఇంట ఉండాల్సిందే. చెన్నకేశవరెడ్డి చిత్రంలో బాలయ్య వాడిన కత్తిని చేయించడానికి రూ.9 వేలు ఖర్చు చేశాడట.

కత్తితో వెళ్లి చిక్కుల్లో

కత్తితో వెళ్లి చిక్కుల్లో

అలా బాలయ్య చేతపట్టిన కత్తి లాంటి ఆయుధాన్ని పట్టుకొని తన అభిమానులతో కలిసి వీధుల్లో ఊరేగింపుగా వెళ్లాడు. కత్తితో ఉన్న వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. వెంకటేష్‌లో ఉన్నది అభిమానమే కానీ.. నేర ప్రవృత్తి కాదు అని గుర్తించిన న్యాయమూర్తి చిన్న హెచ్చరికతో కేసు నుంచి విముక్తి కలిగించాడు.

బాలయ్య దుస్తులతో..

బాలయ్య దుస్తులతో..

ప్రతీ ఏడాది బాలకృష్ణను మూడుసార్లు కలుస్తాడట. ప్రతీ సినిమాలో తన గెటప్‌కు సంబంధించిన ఫోటోలను వెంకటేష్‌కు స్వయంగా బాలయ్య ఫోటోలను మూడు నెలల ముందుగానే పంపిస్తాడట. అలా వచ్చిన ఫోటోల సహాయంతో బాలయ్య ధరించిన దుస్తులను, వస్తువులను సినిమా రిలీజ్ నాటికి రెఢీ చేసుకొంటాడు. వాటిని ధరించి విడుదల రోజు బాలయ్య సినిమాను చూస్తాడని స్థానికులు చెప్పుకొంటారు.

బల్లారి బాలయ్యకు ఫ్యాన్స్

బల్లారి బాలయ్యకు ఫ్యాన్స్

సినిమాలో బాలయ్య లెజెండ్ అయితే బళ్లారిలో వెంకటేష్ మాకు లెజెండ్ అని బాలయ్య అభిమానుల చెప్తుంటారు. బాలయ్య వీరాభిమాని వెంకటేష్‌కు నందమూరి అభిమానులు అండగా ఉంటారట. బాలయ్య సినిమా రిలీజ్ అయినా, శతదినోత్సవం అయినా, లేదా సినిమా షూటింగ్ ప్రారంభమైన వెంకటేష్‌తో కలిసి వెళ్తుంటాం. బాలయ్యను కలుస్తాం అని స్థానికులు చెప్పారు. బళ్లారి బాలయ్యకు స్వయంగా అభిమాన సంఘాలు ఉండటం గమనార్హం.

తారక రామారావు సన్నాఫ్ బళ్లారి బాలయ్య..

తారక రామారావు సన్నాఫ్ బళ్లారి బాలయ్య..

బాలయ్య అంటే విపరీతమైన అభిమానాన్ని చూపే వెంకటేష్‌కు నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడి పేరు తారక రామారావు. తన కుమార్తెల పెళ్లి కార్డులపై ఎన్టీఆర్, ఆయన సతీమణి బసవతారకం ఫొటోలను ప్రింట్ చేయించాడు. అలా చేయడం వల్లే తన కుమార్తెల వైవాహిక జీవితం బాగుందనే భావనను వెంకటేష్ వ్యక్తం చేస్తాడు. తన కుమార్తెలకు కూడా బాలకృష్ణ అంటే ఇష్టం కూడా. బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుందని, తామంతా తమ తండ్రితో కలిసి విడుదల రోజే బాలయ్య సినిమాను చూస్తామని వెంకటేష్ కుమార్తెలు చెప్పుకొంటారు.

English summary
Ballari resident Maliyamma (76) is die hard fan for Nandamuri Ramarao. Everyday she performs prayers to NTR. Her son Venkatesh alias Ballari Balaiah also fan for Balaiah. His life dedicated to Nandamuri Balakrishna too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu