ఎన్టీఆర్ గురించి మాట్లాడిన ఏపీ మంత్రి.. నందమూరి అభిమానులు ఫైర్

Recommended Video

Ap Minister Made Sensational Comments On NTR Film Journey

ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో టాప్ స్టార్‌గా కొనసాగుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంచెలంచెలుగా ఎదుగుతూ నటన, డాన్స్ పరంగా టాలీవుడ్‌లో తనదైన మార్క్ చూపించారు. నందమూరి ఫ్యామిలీ నటనా వారసత్వాన్ని కొనసాగుతూ అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. అయితే తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఎన్టీఆర్ జర్నీపై ఆసక్తికరంగా స్పందించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మంత్రి ఏపీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య. వివరాల్లోకి పోతే..

కొడాలి నాని ఆత్మీయ అభినందన సభ.. ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు

కొడాలి నాని ఆత్మీయ అభినందన సభ.. ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు

టీడీపీ పార్టీలో కీలక భూమిక పోషించి ఇటీవలే వైసీపీలో చేరిన కొడాలి నాని.. జగన్ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. గుడివాడలో జరిగిన ఈ ఆత్మీయ అభినందన సభకు హాజరైన ఏపీ మంత్రి పేర్ని నాని.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఎన్టీఆర్‌ ఈ స్టేజ్‌లో ఉన్నాడంటే కారణం

ఎన్టీఆర్‌ ఈ స్టేజ్‌లో ఉన్నాడంటే కారణం

కొడాలి నాని అభినందన సభలో మాట్లాడిన రాష్ట్ర రవాణాశాఖ, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి, జూనియర్ ఎన్టీఆర్‌ను నటుడిగా తీర్చిదిద్దింది గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అంటూ ఆ వేదికపై పేర్ని నాని వ్యాఖ్యానించారు.

కంట్రోల్ తప్పుతున్నారు.. టీడీపీ వర్గాల ఆందోళన

కంట్రోల్ తప్పుతున్నారు.. టీడీపీ వర్గాల ఆందోళన

గతంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'సాంబ' సినిమాను నాని నిర్మించాడు. ఈ ఒక్క కారణంగా ఎన్టీఆర్ ని నటుడిగా తీర్చిదిద్దింది కొడాలి నాని అని చెప్పడం సమంజసం కాదని ఫైర్ అవుతున్నాయి టీడీపీ వర్గాలు. ఏదో తమ నాయకున్ని పొగడాలనే కుతూహలంతో పేర్ని నాని కంట్రోల్ తప్పి మాట్లాడారని అంటున్నాయి టీడీపీ వర్గాలు. వాస్తవానికి తారక్, కొడాలి నాని మంచి అనుబంధం ఉంది.కానీ ఈ రకమైన మాటలు నందమూరి అభిమానుల్లో ఆగ్రహం తెప్పించాయి.

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలు కావడంతో గత కొంతకాలంగా ఎన్టీఆర్ పై అందరి దృష్టి పడింది. ఇక టీడీపీని కాపాడేది ఎన్టీఆర్ ఒక్కరే అనే వార్తలు ఎక్కువయ్యాయి. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడని టాక్ వినిపించింది. అయితే ఇలాంటి వార్తలపై ఎన్టీఆర్ ఇప్పటిదాకా స్పందించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X