పొలిటికల్ సెగ: ‘అరవింద సమేత’ థియేటర్ వద్ద గొడవ, ప్లెక్సీల చించివేత!

Recommended Video

Aravinda Sametha : Nandamuri Fans Makes Argument For Tickets

విశాఖ జిల్లా పాయకరావుపేటలో 'అరవింద సమేత' సినిమా ప్రదర్శితం అవుతున్న సాయిమహల్‌ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయ వివాదాల కారణంగా ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

నందమూరి కల్చరల్‌ యూత్‌ అసోసియేషన్, బాలకృష్ణ ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీనుకు... అతడి వర్గీయులకు టిక్కెట్లు ఇవ్వక పోవడంతో గొడవ మొదలైంది. వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకు టిక్కెట్లు ఇవ్వొద్దన్నారు?

ఎందుకు టిక్కెట్లు ఇవ్వొద్దన్నారు?

నందమూరి కల్చరల్‌ యూత్‌ అసోసియేషన్, బాలకృష్ణ ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీను కొన్ని రోజులుగా తెలుగు దేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారట. విశ్వనాధుల శ్రీను ఇటీవల వైసీపీలో చేరారు. ఈ కారణంగానే వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని చెప్పినట్లు చర్చించుకుంటున్నారు.

 పార్టీ ఏదైనా మేము నందమూరి అభిమానులమే

పార్టీ ఏదైనా మేము నందమూరి అభిమానులమే

దీంతో ఆగ్రహానికి లోనైన వారు, థియేటర్ ముందు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను చించివేసి నిరసన తెలిపారు. తాను ఏ పార్టీలో ఉన్నా నందమూరి హీరోల అభిమానులమే అని, తమ అభిమానానికి రాజకీయ రంగుపులమడం సరికాదన్నారు. ఈ గొడవ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.

అరవింద సమేత సూపర్ హిట్

అరవింద సమేత సూపర్ హిట్

మరో వైపు ‘అరవింద సమేత' చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అమెరికాలో ప్రీమియర్ షోల దగ్గర నుండి తెలుగు రాష్ట్రాల్లో బెనినిఫిట్ షోలు మొదలైనప్పటి నుండే సినిమా మంచి రెస్పాన్స్ వస్తోంది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం హిట్ అని తేలిపోయింది.

బాక్సాఫీసు వద్ద రికార్డులు షురూ

బాక్సాఫీసు వద్ద రికార్డులు షురూ

మరో వైపు బాక్సాఫీసు వద్ద కూడా రికార్డులు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ఏ ప్రీమియర్ షోల ద్వారా 1 మిలియన్ డాలర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల పైచిలుకు బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X