twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీకో దండం రా బాబూ అంటూ..., ఎన్టీఆర్, హరికృష్ణ, కళ్యాణ్ రామ్ కంట తడి

    |

    జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. నందమూరి అన్నదమ్ములు. రోడ్డు ప్రమాదంలో అన్న జానకిరామ్‌ను కోల్పోయినప్పటి నుంచి మరెవరి కుటుంబంలోనూ ఇలాంటి విషాదం జరగకూడదని దేవుణ్ని ప్రార్థిస్తూ.. తమ సినిమాల ప్రదర్శన సమయంలో అభిమానులకు హెచ్చరికలు కూడా చేస్తున్నారు.

    ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మళ్లీ ఇంటికి వెళ్లే వరకు జాగ్రత్తగా ఉండాలని, ఇంట్లో తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారని ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని తమ అభిమానులకు సూచనలు చేశారు.. చేస్తున్నారు. జానకిరామ్ అకాల మరణంతో ఆయన పిల్లల ఆలనాపాలనను ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ చూస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ పెద్దన్న పిల్లలను పెంచి పెద్దవాళ్లను చేస్తున్నారు. జానకిరామ్‌ కుమారులు తారకరామారావు(13), సౌమిత్ర ప్రభాకర్‌(11)ల పంచెకట్టు వేడుక..తూర్పుగోదావరి జిల్లా వేళంగిలో ఉంటున్న తాత యార్లగడ్డ ప్రభాకరరావు ఇంట్లో జరిగింది. ఆ విశేషాలు...

    హరికృష్ణ పెద్దకుమారుడు:

    హరికృష్ణ పెద్దకుమారుడు:

    నందమూరి హరికృష్ణ పెద్దకుమారుడు ఏడాది క్రితం రోడ్డుప్రమాదంలో మృతిచెందిన జానకిరామ్‌ కుమారులు తారకరామారావు(13), సౌమిత్ర ప్రభాకర్‌(11)ల పంచెకట్టు వేడుక..వేళంగిలో ఉంటున్న తాత యార్లగడ్డ ప్రభాకరరావు ఇంట్లో జరిగింది. ఒకరోజు ముందుగానే కాకినాడ చేరుకున్న నందమూరి హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ దంపతులు శనివారం ఉదయం పోలీస్‌బందోబస్తు మధ్య వేళంగి చేరుకున్నారు.

    కంటతడిపెట్టారు:

    కంటతడిపెట్టారు:

    తాత హరికృష్ణ, బాబాయ్‌లు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లను చూడగానే జానకిరామ్‌ కుమారులు తారకరామారావు, సౌమిత్రప్రభాకర్‌లు ఒక్కసారిగా ఉద్విగ్నతకు లోనయ్యారు. వారిని ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు. ఈ సమయంలో హరికృష్ణ భార్య లక్ష్మి, జానకిరామ్‌ భార్య ప్రభా దీపిక కంటతడిపెట్టారు.

    హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ దంపతులు:

    హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ దంపతులు:

    హరికృష్ణ వియ్యంకుడు యార్లగడ్డ ప్రభాకరరావు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పూజామందిరంలో వేదపండితులు పిల్లలిద్దరిచేత పూజలు చేయించారు. మేనమామ యార్లగడ్డ కార్తీక్‌ చేతులమీదుగా శాస్త్రోక్తంగా పంచెకట్టు తంతు జరిపించారు. హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ దంపతులు పిల్లలను ఆశీర్వదించి బంగారు కానుకలు, పట్టువస్త్రాలు అందజేశారు.

     నందమూరి వారసులు:

    నందమూరి వారసులు:

    సుమారు రెండు గంటల సేపు అక్కడే ఉన్న నందమూరి హీరోలతో ఫొటోలు తీయించుకోవడానికి అభిమానులు, పోలీసులు పోటీపడ్డారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ బయటకు వచ్చి అందరితో ఫొటోలు దిగి అభిమానులను ఉత్సాహపరిచారు. అనంతరం అభిమానుల కేరింతల మధ్య నందమూరి వారసులు అక్కడ నుంచి కాకినాడ వెనుదిరిగి వెళ్లిపోయారు.

    జూనియర్‌ ఎన్టీఆర్‌:

    జూనియర్‌ ఎన్టీఆర్‌:

    సినిమా షూటింగ్‌ ఉండటంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒక్కరే హైదరాబాద్‌ వెళ్లిపోగా హరికృష్ణ, కళ్యాణ్‌రామ్‌ మిగిలిన కుటుంబసభ్యులు రాత్రి నడకుదురులోని ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో యార్లగడ్డ ప్రభాకర్‌ ఏర్పాటుచేసిన రిసెప్షన్‌కు హాజరయ్యారు.

    సరదా సంభాషణ:

    సరదా సంభాషణ:

    అక్కడ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మధ్య సరదా సంభాషణ సాగింది. ఈ సందర్భంగా అన్నయ్య కల్యాణ్ రామ్.. తమ్ముడు ఎన్టీఆర్‌కు రెండు చేతులు జోడించి దండం పెట్టి.. ‘‘నీతో కష్టంరా బాబూ.. నీతో మాట్లాడడం అంత ఈజీ కాదు'' అని అన్నారు. ఎన్టీఆర్‌కు పురాణాలు, సాంప్రదాయలపై బాగా పట్టుంది. పంచెకట్టు కార్యక్రమంలో సంప్రదాయాల గురించి చర్చిస్తున్నప్పుడు ఎన్టీఆర్ మాటలు విని కల్యాణ్‌రామ్ పై విధంగా స్పందించినట్టు తెలుస్తోంది.

    English summary
    NTR traveled by road from Rajahundry to Kakinada by greeting his fans on the way. NTR received a grand welcome in Kakinada too. NTR visited Kakinda to attend the Dhoti Function of his brother Janaki Ram’s son. NTR attended the function with his family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X