ఆర్ఆర్ఆర్ లాంచ్‌లో 'నందమూరి హరికృష్ణ' ప్రత్యక్షం, చిరుతో కలసి.. మనోజ్ ట్వీట్ వైరల్!
Recommended Video

భారీ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఆదివారం రోజు వైభవంగా లాంచ్ అయింది. చిత్ర టీం రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, రాఘవేంద్ర రావు ఆథిధులుగా హాజరయ్యారు. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కించబోయే ఈ చిత్రం గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. సెలబ్రిటీల్లో కూడా ఆర్ఆర్ఆర్ చిత్రపై విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు పలువురు సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హీరో మంచు మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

క్లాప్ కొట్టిన మెగాస్టార్
ముహూర్తపు షాట్ పై మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి ప్రారంభించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ కు ఆశీర్వాదాలు అందించారు. సురేష్ బాబు, కొరటాల శివ, వివి వినాయక్ వంటి ప్రముఖల సందడి వాతావరణంలో ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రారంభమైంది.

మనోజ్ ట్వీట్ వైరల్
మంచు మనోజ్ ఇటీవల అభిమానులతో సోషల్ వేదికగా ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాక సమకాలీన అంశాలపై కూడా మనోజ్ స్పందిస్తున్నాడు. తాజాగా మనోజ్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి శుభాకాంక్షలు చేస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హరికృష్ణ ప్రత్యక్షం
ఆర్ఆర్ఆర్ చిత్ర లాంచ్ లో నందమూరి హరికృష్ణ ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన హరికృష్ణ గారి ఆశీస్సులు ఈ చిత్రానికి ఉంటాయని చెప్పడంలో అర్థం ఉంది. కానీ హరికృష్ణ ప్రత్యక్షం కావడం ఏంటని అనుకుంటున్నారా.. ప్రత్యక్షం కావడం మాత్రమే కాదు.. చిరంజీవితో కలసి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని లాంచ్ చేశారు కూడా. ఇదంతా అభిమానులకే సాధ్యం. ఫోటో షాప్ ద్వారా ఆర్ఆర్ఆర్ లాంచ్ లో హరికృష్ణ పాల్గొన్నట్లు అభిమానులు తయారు చేసిన ఫోటో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

సో నైస్ అంటున్న మనోజ్
ఈ ఫోటోని జత చేసి మనోజ్ ట్వీట్ చేశాడు. అభిమానులు తయారు చేసిన ఈ ఫోటోని ఓ చోట చూశాను. చాలా బావుంది. ఆర్ఆర్ఆర్ టీంకు శుభాకాంక్షలు. ఆర్ఆర్ఆర్ సినిమా కాదు.. ఓ పండగ ప్రారంభమైంది అని మనోజ్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











