ఒంటిగంటకు లేపమని.. శాశ్వత నిద్రలోకి.. హరికృష్ణ మృతికి ముందు ఏం జరిగిందంటే..
నటుడు, మాజీ ఎంపీ, తెలుగుదేశం నేత నందమూరి అంత్యక్రియలు హైదరాబాద్‌లో గురువారం అశ్రునయనాల మధ్య ముగిసాయి. బుధవారం ఉదయం నల్లగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. మరణానికి ముందు మంగళవారం రాత్రి అబిడ్స్‌లోని ఆహ్వానం హోటల్ నుంచి బయటకు వెళ్లారు. ఈ సందర్భంగా ఏం జరిగిందంటే..

ఒంటిగంటకు నిద్ర లేపండి
కావలిలో జరిగే పెళ్లికి హాజరయ్యేందకు హరికృష్ణ ఏర్పాట్లు చేసుకొన్నారు. హోటల్ నుంచి ఇంటికి వెళ్లే ముందు హోటల్ మేనేజర్‌తో మాట్లాడారు. బుధవారం తెల్లవారు జామున కావలికి వెళ్లాలి. ఒంటిగంటకు నన్ను నిద్రలేపండి అని చెప్పారని ఆహ్వానం హోటల్ మేనేజర్ వెల్లడించారు.

అదే చివరిసారిగా
హరికృష్ణ కోరిక మేరకు అర్ధరాత్రి నేను ఆయనను నిద్రలేపాను. అదే అతడితో చివరిసారి మాట్లాడాను. ఉదయం లేచే సరికి హరికృష్ణ వాహానం ప్రమాదానికి గురైందని తెలిసి షాక్ గురయ్యాం అని మేనేజర్ కన్నీరుమున్నీరయ్యాడు.

ఇంకా నమ్మలేకపోతున్నాం
బుధవారం ఉదయం హరికృష్ణ ఇకలేరంటూ టీవీల్లో వచ్చిన వార్తలు చూసి నమ్మలేకపోయాం. ఇప్పటికీ ఆయన లేరంటే నమ్మలేకపోతున్నాం. ఆయనతో ఏన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆహ్వానం సిబ్బందితో చాలా చనువుగా ఉండేవారు అని మేనేజర్ అన్నారు.

ఆహ్వానం హోటల్‌తో బంధం
తండ్రి ఎన్టీఆర్ ద్వారా వారసత్వంగా సంక్రమించిన ఆహ్వానం హోటల్‌తో హరికృష్ణకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. ప్రతీరోజు తప్పనిసరిగా ఆహ్వానం హోటల్‌కు వెళ్తుంటారని చెబుతుంటారు. హోటల్‌లో ఆయనకు ప్రత్యేకమైన రూం ఎప్పటికీ ఉంటుంది అని సిబ్బంది చెబుతుంటారు.


Click it and Unblock the Notifications











