నాలుగు రోజుల్లో హరికృష్ణ జన్మదినం.. అంతలోనే విషాదం
టీడీపీ నేత, సినీ నటుడు హరికృష్ణ మృతివార్తను అభిమానులు, కార్యకర్తలు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ బాధతో కుమిలిపోతున్నారు. నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొన్నది. మరో మూడు రోజుల్లో హరికృష్ణ జన్మదినం అనే విషయాన్ని ఆయన స్నేహితులు, సన్నిహితులు కుటుంబ సభ్యులు గుర్తు చేస్తున్నారు.
హరికృష్ణ బర్త్‌డే సెప్టెంబర్ 2వ తేదీ. ఆ రోజున ఆయన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఉన్నారని సన్నిహితులు పేర్కొంటున్నారు. మరో మూడు రోజుల్లో జన్మదినం జరుపుకోవాల్సి ఉండగా హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

నెల్లూరులో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా నల్గొండ జిల్లాలోని అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో కామినేని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.


Click it and Unblock the Notifications











