సెప్టెంబర్ 2 హరికృష్ణ బర్త్‌డే: జన్మదిన వేడుకకు ఆహ్వానించి.. లేకుండా వెళ్లిపోయారని కంటతడి

By Rajababu

టీడీపీ నేత, సినీ నటుడు హరికృష్ణ మృతివార్తను అభిమానులు, కార్యకర్తలు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ బాధతో కుమిలిపోతున్నారు. నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొన్నది. మరో మూడు రోజుల్లో హరికృష్ణ జన్మదినం అనే విషయాన్ని ఆయన స్నేహితులు, సన్నిహితులు కుటుంబ సభ్యులు గుర్తు చేస్తున్నారు.

కడియం వాసితో అనుబంధం

కడియం వాసితో అనుబంధం

హరికృష్ణ మృతి కడియంకు చెందిన తోటకూర దుర్గారావు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. 1999లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేటప్పుడు హరికృష్ణను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. అప్పటి నుంచి ఆయనకు అనుబంధం ఏర్పడింది. వీలు చిక్కినప్పుడలా దుర్గారావుతో హరికృష్ణ మాట్లాడుతుంటాడట. ఆ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తనతో ముచ్చటించారని దుర్గారావు వెల్లడించారు.

బర్త్ డే ఆహ్వానించి

బర్త్ డే ఆహ్వానించి

వచ్చేనెల 2న తన పుట్టినరోజు వేడుకలకు రమ్మని నాకు ఆహ్వానం పంపారు. పూజ కోసం ఏకబిల్వం మొక్కలను తీసుకురమ్మని నాకు చెప్పారు. ఇంతలో హరికృష్ణ మరణం నన్ను షాకింగ్‌కు గురిచేసింది అని అంటూ దుర్గారావు కన్నీరు మున్నీరయ్యాడు.

Recommended Video

Telangana State Honours Nandamuri Harikrishna’s Last Rites
 లోటు పూడ్చలేనిది

లోటు పూడ్చలేనిది

హరికృష్ణ స్నేహానికి విలువిచ్చే వ్యక్తి. ఆయన లేకపోవడం నేను ఊహించుకోలేను. ఆయన లేని లోటు తీర్చలేనిది అని దుర్గారావు విషాదంలో కూరుకుపోయాడు. కడియంతో కూడా హరికృష్ణకు మంచి అనుబంధం ఉందనే విషయాన్ని గుర్తు చేసుకొన్నారు.

సెప్టెంబర్ 2న బర్త్ డే

సెప్టెంబర్ 2న బర్త్ డే

హరికృష్ణ బర్త్‌డే సెప్టెంబర్ 2వ తేదీ. ఆ రోజున ఆయన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఉన్నారని సన్నిహితులు పేర్కొంటున్నారు. మరో మూడు రోజుల్లో జన్మదినం జరుపుకోవాల్సి ఉండగా హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

పుట్టిన రోజుకు ముందే రోడ్డు ప్రమాదంలో

పుట్టిన రోజుకు ముందే రోడ్డు ప్రమాదంలో

నెల్లూరులో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న నందమూరి హరికృష్ణ తన పుట్టిన రోజుకు నాలుగు రోజుల ముందే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా నల్గొండ జిల్లాలోని అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో కామినేని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X