హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభం.. పాడె మోసిన చంద్రబాబు!
నందమూరి హరికృష్ణ అంత్యక్రియల్లో భాగంగా అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు సాగగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు హరికృష్ణ పాడెని మోశారు. ఇంటి నుంచి హరికృష్ణ భౌతిక కాయం ఉన్న పాడెని అంతిమ యాత్రకు సిద్ధం చేసిన వాహనం వరకు మోశారు .
కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానుల అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. వాహనం వెంట కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వెళుతున్నారు. చంద్రబాబు కూడా వాహనం వెంట వెళ్లనున్నారు.

బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. హరికృష్ణ రాజకీయా నాయకుడిగా, సినీ నటుడిగా మంచి ఖ్యాతిని పొందారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తోంది. హరికృష్ణ నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర మెహిదీపట్నం, టోలి చౌకి, నారాయణమ్మ కాలేజ్, విష్పర్ వాలి మీదుగా జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానం వరకు సాగనుంది.


Click it and Unblock the Notifications











