twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకింగ్ : రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూత!

    |

    Recommended Video

    Nandamuri Harikrishna Lost His Life In Road Mishap

    సినీనటుడు, టిడిపి సీనియర్ నేత నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం ఉందయం నల్గొండలో ఈ ఘోరం జరిగింది. నెల్లూరులో ఓ వివాహ కార్యక్రమానికి బయలుదేరుతుండగా ఈ ప్రమాదం జరిగింది. హరికృష్ణ పయనిస్తున్న వాహనం బోల్తా పడడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. హరికృష్ణ ఆకస్మిక మరణంతో అభిమానులు షాక్ లో ఉన్నారు.

    షాక్ లో నందమూరి కుటుంబం

    షాక్ లో నందమూరి కుటుంబం

    హరికృష్ణ మరణవార్తతో నందమూరి కుటుంబ సభ్యులు, బాలకృష్ణ, పురందేశ్వరి ఇతర కుటుంబ సభ్యులంతా తీవ్ర శోకంలో మునిగిపోయారు. వాహనం అతివేగంతో ప్రయాణించడం వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

     రాజకీయ నాయకుడిగా

    రాజకీయ నాయకుడిగా

    తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా, ఎంపీగా హరికృష్ణ చాలా కాలం సేవలందించారు. ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినా పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడూ పాల్గొంటూనే ఉన్నారు. హరికృష్ణ మరణం పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.

    సినీ నటుడిగా

    సినీ నటుడిగా

    హరికృష్ణ నటనలో తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ కు ఆయన పెట్టింది పేరు. 1967 లో హరికృష్ణ తొలిసారి సినీరంగ ప్రవేశం చేశారు. ఆ ఏడాది శ్రీకృష్ణావతారం చిత్రంలో ఆయన నటించారు. హరికృష చివరగా నటించిన చిత్రం శ్రావణమాసం. హరికృష పేరు చెప్పగానే ఈ తరం సినీ అభిమానులకు లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి.

    ముగ్గురు తనయులు

    ముగ్గురు తనయులు

    హరికృష్ణకు ముగ్గురు తనయులు సంతానం. జానకి రామ్, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు రత్నాల్లాంటి బిడ్డలు ఆయనకు కలిగారు. నాలుగేళ్ళ క్రితం జరిగిన ప్రమాదంలో జానకిరామ్ మృతి చెందగా సంగతి తెలిసిందే. తాజాగా హరికృష్ణ మృతి వారి కుటుంబానికి దెబ్బ మీద దెబ్బలా మారింది.

     ప్రాంతంలో

    ప్రాంతంలో

    విధి వశాత్తో లేక దురదృష్టమో తెలియదు కానీ జానకిరామ్ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే హరికృష్ణ కూడా ప్రమాదానికి గురయ్యారు. నల్గొండ జిల్లా పరిధిలోనే ఈ రెండు ప్రమాదాలు జరగడం శోచనీయం.

     తండ్రి

    తండ్రి


    తన తండ్రి ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించిన సమయంలో హరికృష్ణ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ ప్రచార రథాన్ని నడిపించింది హరికృష్ణే కావడం విశేషం. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల లోనే విజయం సాధించగలిగారంటే అందులో హరికృష్ణ పాత్ర కూడా ఉంది.

     పవర్ ఫుల్ రోల్స్

    పవర్ ఫుల్ రోల్స్

    హరికృష్ణ ఎక్కువగా సినీ జీవితంపై దృష్టి పెట్టలేదు. కానీ నటించిన తక్కు చిత్రాలతోనే ఎన్టీఆర్ కు తగ్గ వారసుడిగా నిరూపించుకున్నారు. అనర్గళంగా డైలాగ్స్ చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.

    గ్యాప్ తీసుకుని

    గ్యాప్ తీసుకుని

    శ్రీకృష్ణావతారం, రామ్ రహీం, తల్లా పెళ్ళామా, దానవీర శూర కర్ణ వంటి చిత్రాల్లో మెప్పించిన తరువాత ఆయన కొంత కాలం వెండి తెర నుంచి విరామం తీసుకున్నారు. శ్రీరాములయ్య చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ తరువాత ఆయన నటించిన సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ వంటి చిత్రాలు విజయం సాధించాయి.

    కుమారుల విజయాన్ని

    కుమారుల విజయాన్ని

    హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ హీరోలుగా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ లీగ్ లో కొనసాగుతున్నాడు. సినిమాలు, క్రియాశీలక రాజకీయాలు పక్కన పెట్టి హరికృష్ణ తనయులు విజయాల్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సమయంలో హరికృష్ణ ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటు.

    English summary
    Nandamuri Harikrishna injured in accident, dies. Harikrishna is seniorTDP leader and Actor
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X