twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరికృష్ణ అంతిమయాత్ర.. చితికి కల్యాణ్ రాం నిప్పు.. జనసంద్రంగా రోడ్లు!

    By Rajababu
    |

    నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సినీ న‌టుడు, తెలుగుదేశం పార్టీ నేత నంద‌మూరి హ‌రికృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. గురువారం మధ్యాహ్నం హరికృష్ణ నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ ముందు నడువగా వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పాడెను మోశారు.

    జనసంద్రంగా రోడ్లు

    జనసంద్రంగా రోడ్లు

    అంతిమయాత్ర కోసం అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మెహదీపట్నం నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు రోడ్డుకు ఇరువైపుల జనం బారులు తీరాయి. అంతిమ యాత్ర జనసంద్రంగా మారింది.

    అంతిమయాత్ర వాహనంలో..

    అంతిమయాత్ర వాహనంలో..

    అంతిమయాత్రకు సంబంధించిన వాహనంలో ఎన్టీఆర్, కల్యాణంరామ్, చంద్రబాబు, జాస్తి చలమేశ్వర్, బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ప్రయాణించారు. చంద్రబాబు వాహనంలో ఉండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

    ఏర్పాట్లను పరిశీలించిన వైవీఎస్

    ఏర్పాట్లను పరిశీలించిన వైవీఎస్

    మహాప్రస్తానంలో దర్శకుడు వైవీఎస్ చౌదరీ, ఆలీ, ఇతర సినీ ప్రముఖులు అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలించారు. హరికృష్ణ చితికి పెద్ద కుమారుడు కల్యాణం రాం నిప్పుపెట్టనున్నారు.

    Recommended Video

    Telangana State Honours Nandamuri Harikrishna’s Last Rites
    3.30 గంటలకు మహాప్రస్థానానికి

    3.30 గంటలకు మహాప్రస్థానానికి

    అంతిమయాత్ర వాహనం సుమారు 3.30 గంటల ప్రాంతంలో మహాప్రస్థానానికి చేరుకొన్నది. భారీగా జనం తరలివచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హజరవుతున్నట్టు సమాచారం.

     భారమైన హృదయంతో కల్యాణ్ రాం

    భారమైన హృదయంతో కల్యాణ్ రాం

    అంతిమయాత్ర వాహనం ముందు కల్యాణ్ రాం తండ్రికి పెట్టే తల కొరివితో భారమైన హృదయంతో కదిలారు. కల్యాణ్ రాం వెంట ఎన్టీఆర్ నడిచాడు. మహాప్రస్థానంలో వాహనం నుంచి హరికృష్ణ భౌతికకాయాన్ని దించగా.. అక్కడ నుంచి చితి వరకు చంద్రబాబు తదితరులు పాడెను మోశారు.

    చివరగా పాడెను మోసిన బాలకృష్ణ

    చివరగా పాడెను మోసిన బాలకృష్ణ

    చివరగా బాలకృష్ణ, చంద్రబాబు, వైవీఎస్ చైదరీ, ఇతర కుటుంబ సభ్యులు పాడేను మోశారు. అంత్యక్రియలను అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకొన్నారు.

    ఇసుక వేస్తే రాలనంత జనం

    ఇసుక వేస్తే రాలనంత జనం

    హరికృష్ణ అంత్యక్రియలు జరిగే మహాప్రస్థానంలో ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

    మహా ప్రస్థానంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

    మహా ప్రస్థానంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

    వీఐపీలు, సినీ ప్రముఖులు భారీగా హాజరవుతుండటంతో మహాప్రస్థానం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు హాజరయ్యారు.

    English summary
    Former MP Nandamuri Harikrishna passed away early on Wednesday following an accident on the Narketpally-Addanki highway in Nalgonda district. He is known for his notice-worthy performances in films like Laahiri Laahiri Laahirilo (2002) and Seetayya (2003).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X