హరికృష్ణ అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడంటే..
తండ్రి హరికృష్ణ మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాదవార్త తెలియగానే ఎన్టీఆర్, కల్యాణ్ రాం వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. హాస్పిటల్‌లో తండ్రి పార్థీవదేహాన్ని చూసి భోరున విలపించారు. పొంగుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకొంటూ తండ్రి భౌతికకాయాన్ని హైదరాబాద్ తరలించే ఏర్పాట్లలో మునిగిపోయారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మెహదీపట్నంలోని ఆయన నివాసానికి భౌతికకాయం చేరుకొనే అవకాశం ఉంది.
అనంతరం హరికృష్ణ భౌతికకాయాన్ని బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ టీడీపీ కార్యాలయానికి తరలిస్తారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల చివరిచూపుల అనంతరం ఫిలింఛాంబర్‌కు తరలించే అవకాశం ఉంది.

ఇక హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరుగుతాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని హరికృష్ణ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిసింది.
nandamuri harikrishna harikrishna movies harikrishna death janaki ram death ntr kalyan ram nagarjuna seetayya laahiri laahiri laahirilo yvs chowdary హరికృష్ణ మరణవార్త హరికృష్ణ న్యూస్ జానకీ


Click it and Unblock the Notifications