బిగ్ బాస్ సీజన్ 2లో నందమూరి హీరో !
Recommended Video

బిగ్ బాస్ రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించనుండగా ఈ కార్యక్రమం 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్ లో జరగనుంది. ఫస్ట్ సీజన్ కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సీజన్ ను ప్లాన్ చేస్తున్నారు షో నిర్వాహకులు. త్వరలో ఈ షో గురించి పూర్తి వివరాలు తెలియబోతున్నాయి.
బిగ్ బాస్ 2'పై ప్రారంభమవుతున్నట్లు ప్రకటించారో లేదో పలువురు సినీ తారలు ఈ ప్రోగ్రామ్ లో పాల్గోనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 10 నుంచి ప్రారంభమయ్యే 'బిగ్ బాస్ 2' షోలో పాల్గొనబోయేది వీరే అంటూ కొంతమంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.

తాజా సమాచారం మేరకు నందమూరి తారకరత్న ఈ షోలో పాల్గోనబోతున్నాడని సమాచారం. తారకరత్న ఏ మధ్య రాజా చెయ్యి వేస్తె సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తరువాత బిగ్ బాస్ లో కనిపించబోతున్నాడు ఈ హీరో.
సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామల, యాంకర్ లాస్య, హీరోయిన్ రాశి, హీరోయిన్ చార్మి కౌర్, ధన్య బాలకృష్ణ, జూనియర్ శ్రీదేవి, హీరోయిన్ గజాలా, చాందిని చౌదరి, శ్రీ రెడ్డి, వరుణ్ సందేశ్, థనీష్ , వైవా హర్షా, కమెడీయన్ వేణు, ఆర్యన్ రాజేష్ ఈ 15మంది కంటెస్టెంట్స్ సీజన్ 2లో పాల్గొననున్నారని సమాచారం. ఈ పేర్లలో కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. త్వరలో లిస్టు ను అధికారికంగా ప్రకటించబోతున్నారు షో నిర్వాహకులు.


Click it and Unblock the Notifications











