మీసాలు మెలేస్తూ నందమూరి హీరో (ఫొటో)
హైదరాబాద్ :కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పటాస్'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ చిత్రం కొత్త లుక్ ని విడుదల చేసారు కళ్యాణ్ రామ్. ఈ ఫొటోలో రాయిల్ లుక్ తో కనిపిస్తున్నారు ఆయన. మీసాలని తిప్పుతూ ఆయన పోలీస్ ఆఫీసర్ గెటప్ కు నిండుతనం తెచ్చారు. నందమూరి అభిమానులు ఈ ఫొటో చూసి పండుగ చేసుకుంటున్నారు. మీరూ ఇక్కడ ఆ ఫొటోని చూడండి.
https://www.facebook.com/TeluguFilmibeat

చిత్రం ఆడియో ఎప్పుడు
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తూనిర్మిస్తున్న ‘పటాస్' చిత్రం ఆడియో న్యూఇయర్ వేడుకగా జనవరి 1న జరగనుందని సమాచారం. వాస్తవానికి ఈ ఆడియో ఫంక్షన్ ఈనెల (డిసెంబర్) 7న జరగాల్సి ఉంది. కానీ కళ్యాణ్‌రామ్ సోదరుడు జానకిరామ్ ఆకాల మృతితో ఆడియో వేడుక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ పాటల ఆవిష్కరణ కార్యక్రమాన్ని జనవరి 1న హైదరాబాద్‌లో చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తాజా ఫిలింనగర్ సమాచారం.
సాయి కార్తీక్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. కళ్యాణ్‌రామ్ సరసన శృతిసోధి కథానాయికగా నటిస్తుంది. ఇందులో కళ్యాణ్‌రామ్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపిస్తూ అలరించబోతున్నాడు.
ఈ సినిమా గురించి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ.... ‘రొమాంటిక్ , యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్ మంచి సంగీతాన్ని అందించారు. త్వరలో ఆడియోను, చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు.
పోటీ ఉంటుందా
మరో ప్రక్క టెంపర్' మీదన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఈ చిత్రం పోటీ వస్తుందా అనే అనుమానంలో నందమూరి అభిమానులు ఉన్నారు.
టెంపర్ పోస్టర్ విడుదల చేసిన కొన్ని గంటలకే పటాస్ పోస్టర్ రిలీజ్ చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కథ విషయానికి వస్తే అటు టెంపర్‌లోనూ ఇటు పటాస్‌లోనూ ఇద్దరూ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపిస్తుండడం విశేషం.
టెంపర్ కన్నా ముందే పటాస్ విడుదల అయ్యే అవకాశం ఉందనే టాక్ వినబడుతోంది. చాల కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న కళ్యాణ్‌రామ్ ఈ చిత్రంతోనైనా హిట్ సాధించాలనుకుంటున్నాడు. ఈ చిత్ర ఆడియో త్వరలో విడుదల చేసే ఆలోచనలో రామ్ ఉన్నారు.
బిజినెస్ విషయానికి వస్తే...
చిత్రం...ఆంధ్రా,నైజాం రైట్స్ మొత్తం మంచి రేటు కు దిల్ రాజు తీసేసుకున్నట్లు ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే నైజాం, కృష్ణా తన సొంత రిలీజ్ చేసుకుని మిగతా ఏరియాలను తను బిజినెస్ చేయనున్నాడని తెలుస్తోంది.
సాయికుమార్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్ మురారి, ఎడిటింగ్: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి.


Click it and Unblock the Notifications











