‘దాన వీర శూర కర్ణ’లో నందమూరి నూతన వారసుడు
హైదరాబాద్: శ్రీసాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా అందరూ బాలనటీనటులతో తెరకెక్కబోతున్న చిత్రం ‘దాన వీర శూర కర్ణ'. జే.వి.ఆర్ దర్శకుడు. సి.హెచ్ వెంకటేశ్వరరావు, జె.బాలరాజు నిర్మాతలు. బాల నటీనటుల కోసం ఇటీవల టాలెంట్ హంట్ నిర్వహించారు.
ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర కోసం నందమూరి జానకీరామ్ తనయుడు మాస్టర్ తారక రామారావు ఎంపిక చేసారు. ఇతర కీలక పాత్రధారులను కూడా ఎంపిక చేసారు. త్వరలో సెట్స్ మీదకెల్లబోతున్న ఈ సినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన బాలరాజు మాట్లాడుతూ...నందమూరి జానకీరామ్ తనయుడు మాస్టర్ తారక రామారావు మా సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఇటువంటి సినిమాను బాలనటులతో తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి. నటీనటులందరికీ ట్రైనింగ్ ఇచ్చి అతి త్వరలో రెగ్యులర్ షూటింగుకి వెళ్తామన్నారు.
స్లైడ్ షోలో ఫోటోస్...

నూతన వారసుడు
జానకీరామ్ తనయుడు మాస్టర్ తారక రామారావు బాల నటుడుగా పరిచయం కాబోతున్నాడు...

దాన వీర శూర కర్ణ
ఒకప్పుడు ‘దాన వీర శూర కర్ణ' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా పేరు పోగొట్టుకండా అన్ని జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కిస్తామన్నారు నిర్మాత బాలరాజు.

సరికొత్త టెక్నాలజీ
మా దర్శకుడు బాగా తీస్తారనే నమ్మకం ఉంది. కొత్త టెక్నాలజీ, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తాం. చిన్న పిల్లలతో సినిమా కాబట్టి త్వరగా పూర్తి చేయాలని కంగారు పడకుండా కాస్త టైమ్ తీసుకుని అతి జాగ్రత్తగా చిత్రీకరణ చేస్తాం అని తెలిపారు.

నటీనటులు, టెక్నీషియన్స్
బోయిన సుబ్బారావు, బాలాజీ, ‘బాల రామాయణం' ఫేం స్వాతి కుమార్, దగ్గుబాటి అభిరామ్ తదితరులు టాలెంట్ హంట్ కార్యక్రమంలో పాల్గొని నటీనటులను ఎంపిక చేసారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి, నిర్మాణ నిర్వహణ: కాజ సూర్యనారాయణ, సమర్పణ: జగపతి మూవీ క్రియేషన్స్.


Click it and Unblock the Notifications











