తెరపైకి నందమూరి నాలుగో తరం
హైదరాబాద్ :నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం తెరపైకొచ్చింది. ప్రముఖ నటులు హరికృష్ణ మనవడు మాస్టర్ నందమూరి తారక రామారావు తెరంగేట్రం చేశారు. ఆ చిన్నారి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'స్కేటింగ్ మాస్టర్'. ఆది, స్నేహిక జంటగా నటించారు. ఆది స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తారు.
లక్ష్మీ సాయి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న చిత్రం 'స్కేటింగ్ మాస్టర్'. క్రీడల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఆది దర్శక నిర్మాత. నందమూరి జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావు బాలనటుడిగా పరిచయమవుతున్నారు.''కథాబలమున్న చిత్రమిది. ఇందులో నేను ప్రాధాన్యమున్న ఓ మంచి పాత్రను పోషించాను''అన్నారు హీరోయిన్ స్నేహిక.
దర్శకనిర్మాత మాట్లాడుతూ ''క్రీడా నేపథ్యంలో సాగే చిత్రమిది. స్కేటింగ్ గురించి అందరికీ తెలియాలనే ఈ చిత్రాన్ని తీశాను. నందమూరి జానకిరామ్ తనయుడు మాస్టర్ నందమూరి తారక రామారావు ఈ చిత్రంలో చేసిన స్కేటింగ్ విన్యాసాలు ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి''అన్నారు.
ఆది మాట్లాడుతూ "స్కేటింగ్‌లో నాకు ప్రవేశం ఉంది. ఇదే అంశంపై నిర్మించిన చిత్రంలో నందమూరి తారకరామారావును బాలనటుడిగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. చిత్రంలో స్కేటింగ్ విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ఐదు పాటలున్నాయి. ఈ తరానికి నచ్చే విధంగా శ్రీ వెంకట్ స్వరాలను సమకూర్చారు. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. సినిమా అంతా పూర్తయింది'' అని అన్నారు.
ఆది, స్నేహిక, రహమాన్, బల్లెం శ్రీ వెంకట్, నరేష్, తేజ,సురేష్, అక్షయ్, రోహన్, శ్రేష్ట్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: గోపి, సంగీతం: శ్రీ వెంకట్, కూర్పు: సాయిబాబా, నృత్యం: రాము, కథ, మాటలు, నిర్మాణం, దర్శకత్వం: ఆది.


Click it and Unblock the Notifications











